మహేష్ ” గుంటూరు కారం ” స్పెషల్ సాంగ్ లో ఆ యంగ్ బ్యూటీ… ఇక అదుర్స్ ఏ గా…!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” గుంటూరు కారం “. హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ గ్రాండ్గా నిర్మిస్తున్న ఈ మూవీలో శ్రీ లీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఇక ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ రానున్న సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ లెవెల్ లో ఆడియన్స్ ముందుకు రానుంది. ఇక అసలు మేటర్ లోకి వెళితే… ఈ మూవీలో ఓ స్పెషల్ మాస్ ఐటెం మెంబర్ ఉండగా… ఈ సాంగ్లో పూజా హెగ్డే నటించే అవకాశం ఉందని ఇటీవలే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇక లేటెస్ట్ టాలీవుడ్ క్రేజీ బజ్ ప్రకారం డింపుల్ హయతి ఈ సాంగ్లో సూపర్ స్టార్ తో డాన్స్ చేయనున్నట్లు సమాచారం. గతంలో గద్దలకొండ గణేష్ అనే మూవీలో డింపుల్ ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక గుంటూరు కారం మూవీ లో కూడా ఈ ముద్దుగుమ్మ ఐటెం సాంగ్ చేయనుందట. ఇక దీనిపై అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.