జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన మీనాక్షి చౌదరి.. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుందో..?

వామ్మో.. నిజంగానే మీనాక్షి చౌదరికి ఎక్కడో మచ్చ ఉంది. లేకపోతే నిన్న మొన్నటి వరకు అసలు ఇండస్ట్రీలో ఆమె ఉందా..? లేదా..? అని పట్టించుకున్న డైరెక్టరే లేరు. ఇప్పుడు స్టార్ హీరోలు ఆమె తమ సినిమాల్లో ఉండాలి అంటూ పట్టుబడుతున్నారు. డైరెక్టర్లు కూడా ఏకంగా ఇంటికి వెళ్లి మరి ఆమె కాల్ షీట్స్ బుక్ చేసుకుంటున్నారు. ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో మీనాక్షి చౌదరి పేరు మారుమ్రోగిపోతుంది.

శ్రీ లీల – రష్మిక మందన్నాల తర్వాత ఆమెకే అందరూ ఓట్లు వేస్తున్నారు. ఆమెని హీరోయిన్గా పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . రీసెంట్గా రాంచరణ్ సైతం మీనాక్షి చౌదరిని తన సినిమాలో సెకండ్ హీరోయిన్గా పెట్టుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో కీయరా అద్వానీ మొదటి హీరోయిన్గా సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపించాయి.

తాజాగా సోషల్ మీడియాలో సెకండ్ హీరోయిన్ గా ఈ సినిమాలో మీనాక్షి చౌదరి సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో అమ్మడు జాక్ పాట్ ఆఫర్ కొట్టేసింది అంటూ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. దీన్నంతటికి కారణం మహేశ్ “గుంటూరు కారం” సినిమా అనే చెప్పాలి. చూద్దాం అమ్మడి ఖాతాలో ఇంకా ఎన్ని ఆఫర్స్ వస్తాయో..?