రాత్రికి రాత్రి ఎన్టీఆర్ సినిమా దొబ్బేసి హిట్ కొట్టిన మహేశ్ ..ఆ మూవీ ఇదే..!!

సినిమా ఇండస్ట్రీ అంటేనే మాయా లోకం.. రంగుల ప్రపంచం.. ఎప్పుడు ఏం జరుగుతుందో ..ఎవరి కెరియర్ ఎప్పుడు టర్న్ అవుతుందో.. ఎవ్వరం చెప్పలేం..?? అలాంటి హీరోలు – హీరోయిన్లు – ఆర్టిస్టులు మన ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు . అయితే ఓ హీరో కోసం రాసుకున్న కథను మరో హీరోతో చేయడం కూడా సర్వసాధారణం . ఇలా ఎంతోమంది హీరోలు నటించారు.

ఎన్టీఆర్ – మహేష్ బాబు కూడా అదే లిస్టులోకి వస్తారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా అల్లరి నరేష్ సెకండ్ హీరోగా తెరకెక్కిన సినిమా మహర్షి . ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డును బద్దలు కొట్టింది . అయితే మొదటిగా ఈ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలో ఎన్టీఆర్ ని అనుకున్నారట వంశీ పైడిపల్లి . కానీ అప్పటికే వేరే సినిమా షూట్స్ లో బిజీగా ఉండడంతో ఒక సంవత్సరం పాటు టైం అడిగారట .

కానీ అంత టైం వెయిట్ చేయలేని వంశీ పైడిపల్లి ఆ తర్వాత లిస్టులో ఉన్న మహేష్ బాబుకు ఈ సినిమా చెప్పగా ఆయన ఓకే చేయడం ..సినిమా షూట్ త్వరగా కంప్లీట్ చేసి,, రిలీజ్ చేయడం ..సినిమా హిట్ అవడం చకచకా జరిగిపోయాయి . అలా తారక్ చేయాల్సిన సినిమా మహేష్ చేశాడు..!!