పాన్ ఇండియా హీరోలు “చరణ్-తారక్-బన్ని-ప్రభాస్” సాధించలేని ఘనత అందుకున్న నాని.. రియల్ హీరో అంటే వీడే..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్న పాన్ ఇండియా హీరోలు అనగానే అందరికీ టక్కున గుర్తుచేది నలుగురే నలుగురు. చరణ్  – తారక్ – బన్నీ – ప్రభాస్ నలుగురు కూడా పాన్ ఇండియా హీరోలుగా పాపులారిటీ సంపాదించుకున్నారు.  ఆ రేంజ్ లోనే రెమ్యూనిరేషన్ అందుకుంటున్నారు . తమ నెక్స్ట్ సినిమాలో కూడా ఆ రేంజ్  లోనే ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.  అయితే పాన్ ఇండియా హీరోలుగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ నలుగురు సాధించలేని రికార్డ్ నాచురల్ స్టార్ నాని అందుకొని తన అభిమానులను ఖుషి చేశాడు.

2023లో ఆయన నటించిన రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి . రెండు కూడా బిగ్ బ్లాక్ బస్టర్ హిట్లే.  దసరా సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వగా ..హాయ్ నాన్న సినిమా కూల్ క్లాసిక్ హిట్టుగా పేరు సంపాదించుకుంది . రెండు కూడా కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చి కొత్త దర్శకులతో హిట్ కొట్టిన ఘనత నానికే దక్కింది . 2023 లో ఇలా ఏ హీరో కూడా చేయలేదు అందుకే అలాంటి క్రేజీ రికార్డ్ అందుకున్న హీరోగా నాని నిలిచిపోయాడు.

కాగా నాని ఎటువంటి సపోర్ట్ లేకుండ ఇండస్ట్రీలోకి వచ్చి..అసిస్టెంట్ డైరెక్టర్ గా  కెరీర్ ప్రారంభించి..ఆ తరువాత హీరో గా మారి..ఇప్పుడు పాన్ ఇండియా లెవల్ లో తన పేరు మారు మ్రోగిపోయేలా చేసుకున్నాడు. ఇండస్ట్రీలో ఎంత మంది తోపు హీరోలు ఉన్నా నాని కి కాంపిటీషన్ కారు అని చెప్పుకొస్తున్నారు ఫ్యాన్స్..!!