టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న కళ్యాణ్ రామ్ తాజాగా నటించిన సినిమా “డెవిల్”. పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా అభిమానులను బాగా ఆకట్టుకుంది . బింబిసారా తో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న కళ్యాణ్ రామ్ ఆ తర్వాత ఇలాంటి హిట్ కోసమే అమిగోస్ సినిమాను ట్రై చేశాడు .
కానీ అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు . ఈ క్రమంలోనే డెవిల్ సినిమా ఆ సక్సెస్ను అందిస్తుంది అంటూ ఆశపడ్డారు . టాక్ పరంగా పాజిటివ్ అందుకున్నా కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం కళ్యాణ్ రామ్ ని డీప్ గా హార్ట్ చేశారు ఫాన్స్ . ఈ సినిమాకి మొదటి రోజు కేవలం మూడు కోట్లు కంటే తక్కువ రావడం గమనార్హం .
టాక్ పరంగా హిట్ అందుకున్నా..కలెక్షన్స్ పరంగా బింబిసారా ను దాటలేకపోయింది .దీంతో సోషల్ మీడియాలో కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమాకి సంబంధించిన టాక్ ప్రశ్నర్ధకంగా మారింది . అసలు ఈ సినిమా హిట్టా పట్టా తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే..!!