సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమే అలాంటి పని చేస్తున్నా.. రాశి ఖ‌న్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

టాలీవుడ్ స్టార్ బ్యూటీ రాశి ఖ‌న్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అంటూ అన్ని ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతుంది ఈ బ్యూటీ. ఎప్పటికప్పుడు బోల్డ్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ లైమ్‌ లైట్‌లో మెరవాలని తెగ ప్రయత్నిస్తుంది. ఈ ముద్దుగుమ్మ గతంలో తెలుగులో చాలా హిట్ సినిమాల్లో నటించి పాపులారిటీ దక్కించుకుంది. ప్రస్తుతం తెలుగులో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ వైపు దృష్టి సారించింది. కాగా తమిళంలో అరుణ్యణై 4 సినిమాలో నటిస్తోంది.

ఈ సినిమా త్వరలోనే రిలీజ్‌కు రెడీగా ఉంది. కాగా ఇటీవల ఆమె పుట్టినరోజు వేడుకలను న్యాచుర‌ల్గా జరుపుకుంది. ఎంతోమంది సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా ఈ సందర్భంగా ఆమె తన తోటలో కొన్ని మొక్కలను నాటింది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుంది. ఆమె మాట్లాడుతూ నా కళ్ళను అట్రాక్ట్ చేసే విధంగా.. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కలిగే విధంగా ఈ మొక్కలు నాటే బాధ్యత తీసుకున్నా.. కొన్ని కారణాలతో మొక్కలను పెంచుతున్నాను అంటూ చెప్పుకొచ్చింది.

ముఖ్యంగా చెట్లు నాకు సంతోషాన్ని క‌లుగ‌జేస్తాయి. అందుకే ఇలా నా పుట్టినరోజు సందర్భంగా సంస్కృతి, సాంప్రదాయాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టా.. అంటూ వివరించింది. ఆమె నాటిన మొక్కల ఫోటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవడంతో పొల్యూషన్ బాగా పెరిగిపోయిన ఈ రోజుల్లో మొక్కలు నాటడం చాలా మంచి విషయం.. మీరు మొక్కలు నాటుతూ.. మరింత మంది నాటడానికి మంచి ఇన్స్పిరేషన్ ఇస్తున్నారు. మంచి పని చేస్తున్నారు.. అంటూ జ‌న్ ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.