ఏంటి ఆ హీరోయిన్ వల్ల… బాలయ్య కూతురుతో చైతు వివాహం ఆగిపోయిందా..!!

దశాబ్దాల‌ కాలం నుంచి ఇండస్ట్రీని ఏలుతున్న వారిలో నందమూరి కుటుంబం, అక్కినేని కుటుంబం ముందు వరుసలో ఉంటారు. ఈ కుటుంబాల నుంచి ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇక ఈ రెండు కుటుంబాల మధ్య మంచి సన్నిహితం ఉంటుంది. బయట ఫంక్షన్స్ లోనే కాకుండా వారి ఫ్యామిలీ ఫంక్షన్స్ కి కూడా ఒకరినొకరు పిలుచుకుంటూ ఉంటారు. ఇక వీరు కేవలం మంచి ఫ్రెండ్స్ గానే కాకుండా వియ్యంకులు సైతం అవుదామని అనుకున్నారట.

గతంలో అక్కినేని నాగచైతన్య సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఆ సమయంలోనే బాలకృష్ణ తన చిన్న కూతురిని నాగచైతన్యకు ఇచ్చి వివాహం చేయాలని అనుకున్నాడట. ఈ విషయాన్ని నాగార్జున కు సైతం చెప్పాడట. దీంతో నాగార్జున కూడా ఓకే చెప్పాడట. ఇక ఈ విషయాన్ని స్వయంగా అక్కినేని నాగేశ్వరరావు ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. కానీ అప్పటికే నాగచైతన్య సమంతతో ప్రేమలో ఉండడంతో ఈ వివాహాన్ని క్యాన్సిల్ చేశారట.

ఇక కొన్ని రోజులకి నాగచైతన్య, సమంత విషయం బయటపడడంతో వీరిద్దరూ కుటుంబ సభ్యుల అంగీకారంతో ఒకటయ్యారు. వివాహం అనంతరం సమంతా సైతం మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక అనంతరం ఏవో మనస్పార్ధాలు కారణంగా… విడాకులు తీసుకున్నారు. అయినప్పటికీ వీరిద్దరికీ ఉన్న ప్రేమ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. వీరిద్దరి అభిమానులు మీరిద్దరూ మళ్లీ కలవాలని.. మొక్కులు, యాగాలు చేస్తున్నారు. ఇలా బాలయ్య అల్లుడు అవ్వాల్సిన చైతు… సమంత కారణంగా తప్పుకున్నాడు.