సలార్ – సలార్ – సలార్ అంటున్నారు సరే.. ఇంతకీ ఆ సలార్ అంటే అర్థం ఏంటో తెలుసా..?

ఇప్పుడు .. ఎక్కడ చూసినా సరే సలార్ అన్న పేరు ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది . అసలు సలార్ అన్న పేరు నిన్న మొదటి వరకు ఎవరికీ తెలియదు. ఎప్పుడైతే ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో తెరకెక్కిస్తున్నాడో..ఈ సినిమాకు సలార్ అని పేరు పెట్టారో అప్పటినుంచి మొబైల్ లో వాట్సాప్ స్టేటస్లు.. ఇంస్టాగ్రామ్ లో స్టోరీలు.. డిపీలు అన్నీ కూడా ప్రభాస్ సలార్ సినిమాకి సంబంధించి ఉంటున్నాయి.

రీసెంట్గా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డును బద్దలు కొట్టేసింది. ఒకే ఒక్క దెబ్బతో కుంభస్థలాన్ని షేక్ చేసి పడేసింది. ప్రభాస్ స్టామినా ఒకటి కాదు రెండు కాదు 100 రెట్లు పెరిగిపోయింది. 100 బాహుబలిల సినిమాకి సమానం ఈ సలార్ సినిమా అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు జనాలు. అయితే ప్రతి ఒక్కరూ సలార్ సలార్ అంటున్నారే కానీ సలార్ అంటే నిజమైన అర్థం ఏంటో తెలుసా..? అన్న క్వశ్చన్ లేవదీశారు రెబెల్ ఫాన్స్ .

ఈక్వషన్ కి ప్రశాంత్ నీల్ ఆన్సర్ ఇచ్చాడు . సలార్ అనేది ఓ ఉర్దూ పదం . సమర్థవంతమైన నాయకుడు అని అర్థం . రాజులకి కుడి భుజముగా ఉండే వాళ్ళని సలార్ అంటూ పిలుస్తూ ఉంటారు అంటూ చెప్పుకొచ్చారు . ప్రభాస్ కటౌట్ కి ఈ సినిమాకి ఆప్ట్ టైటిల్ పెట్టావు ప్రశాంత్ నీల్ పొగిడేస్తున్నారు జనాలు . ఈ సినిమా మొదటి రోజే 175 కోట్లు కలెక్ట్ చేసింది..!!