చలికాలంలో వచ్చే దగ్గు, జలుబుకు ఈ సింపుల్ టిప్స్ తో చెక్ పెట్టండి..

ప్రస్తుత లైఫ్ స్టైల్ లో పెరిగిపోతున్న కాలుష్యం వలన అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక చలికాలం కావడంతో ఈ వాతావరణం లో జలుబు, జ్వరం, దగ్గు సమస్యలు త్వరగా ఎటాక్ అవుతున్నాయి. ముఖ్యంగా జలుబుతో చాలామంది బాధపడుతున్నారు. వాస్తవానికి జ‌లుబు త్వరగా తగ్గదు.. పైగా ముక్కు కారడం, తలనొప్పి, నీరసం లాంటి లక్షణాలు ఉంటే మనం ఏ పని పైన ధ్యాస పెట్టలేము.

ఇక కొంతమంది జలుబుకు ఎలాగో మెడిసిన్ ఉండదు కదా.. అదే తగ్గుతుంది అంటూ దానిని పట్టించుకోరు. కానీ ఎటువంటి మెడిసిన్ లేకపోయినా ఇంటి వైద్యంతో జలుబుకు సింపుల్‌గా చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా చలికాలంలో జలుబు అనేది పెద్దవారిలోను, చిన్న పిల్లలలోను అందరిలో సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ దగ్గు, జలుబు లాంటి సమస్యలు త్వరగా రిలీఫ్ పొందడానికి సింపుల్ రెమెడీస్ ఇప్పుడు చూద్దాం.

చల్లని వాతావరణం వల్ల మాత్రమే కాకుండా సీజన్ మారుతున్న కొద్ది బాడీ డిహైడ్రేషన్ వల్ల కూడా జలుబు సమస్యలు ఏర్పడతాయి. కనుక బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా జాగ్రత్త పడాలి. చలికాలం కదా ఏం కాదు, దాహం అవడం లేదు.. అంటూ నీరు తాగడం తగ్గించేస్తే జలుబు, ముక్కుదిబ్బడ లాంటి సమస్యలు వస్తాయి. నీటిలో ఒక టీ స్పూన్ తేనె కలిపి తాగడం వల్ల జలుబు, ముక్కుదిబ్బడ నుంచి త్వరగా రిలీఫ్ పొందవచ్చు. పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాల వల్ల చాలా చాలా మేలు జరుగుతుంది.

గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగిన గొంతు నొప్పి జలుబుకు వెంటనే ఉపశమనం లభిస్తుంది. చాలామంది నిమ్మకాయ రసం తాగడం వల్ల జలుబు పెరుగుతుందని భావిస్తూ ఉంటారు. అయితే అవన్నీ అపోహాలు. తేనె, నిమ్మరసం లాంటివి గోరువెచ్చని నీటితో కలిపి తాగడం వల్ల జలుబు, గొంతు నొప్పి, దగ్గు లాంటి వాటిని వెంటనే తగ్గించవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇక అల్లం లో ఉండే ఆయుర్వేదిక్ గుణాలు జలుబు నుంచి త్వరగా ఉపశమనం కలిగిస్తాయి. బాగా జలుబుగా ఉన్నప్పుడు అల్లం టీ తాగడం వల్ల మంచి రిలీఫ్ వస్తుంది.

ఇక గుమ్మడి గింజలు, పప్పు ధాన్యాలు, చేప, బాదం లాంటి ఆహారాలను ఫుడ్ డైట్ లో చేర్చుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. జింక్ పుష్కలంగా ఉండే ఈ ఆహారాన్ని తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. బీట్రూట్‌లోనూ డైటరీ నైట్రేట్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది బాడీలో నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడ్యూస్ చేసి జలుబును తగ్గించడానికి సహకరిస్తుంది. కనక జలుబుకు టాబ్లెట్స్ వాడడం కంటే ఇటువంటి ఇంటి చిట్కాలను వాడి ఒకటి రెండు రోజుల్లోనే ఉపసమనం పొందవచ్చు.