అనసూయ.. అందాల ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో నిరంతరం ట్రోలింగ్ కి గురవుతున్న ఏకైక బ్యూటీ . జనాలు ఎంతమంది తిట్టుకున్నా సరే ఆమె ఫోటో షూట్ చేస్తే అందరూ ఆమె అందాలను చూసి కుళ్ళుకొని ఏడ్చేవాళ్ళు అమ్మాయిలు.. అబ్బాయిలు అయితే ఆమె అందంకి ఫిదా అయిపోతారు . అలాంటి చక్కటి రూపం కలిగిన మనిషి అనసూయ . ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం చాలా టఫ్ .. అలా మాట్లాడి అందరి దగ్గర మెప్పించుకోవడం మరి మరి టఫ్..
ఆ విషయంలో అనసూయ ది బెస్ట్ అనే చెప్పాలి. కాగా అనసూయ కెరియర్ స్టార్టింగ్ లో యాంకర్ గా చేసిన విషయం తెలిసిందే. న్యూస్ రీడర్గా తన కెరియర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత ఇండస్ట్రీలోకి రావాలి అన్న ఆశతో సినిమాలో ట్రై చేసింది. అప్పుడే జూనియర్ ఎన్టీఆర్ నాగ సినిమా ద్వారా ఆమె ఇండస్ట్రీకి పరిచయమైంది . అంతకుముందు చాలా సినిమాల్లో ట్రై చేసింది.
కానీ ఎవరు అవకాశం ఇవ్వలేదు. నాగ సినిమా ద్వారానే ఆమె తన ఫస్ట్ సినిమా నటించింది . దీంతో ఆమెకు జూనియర్ ఎన్టీఆర్ నటించిన నాగ సినిమా ఎంతో ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఈ సినిమా తర్వాత అనసూయ మళ్లీ యాంకర్ గా తన కెరియర్ ప్రారంభించింది. ఇప్పుడు పలు కీలకపాత్రలో నటిస్తూ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కి మించిన రేంజ్ ఆఫ్ ఫాలోయింగ్ తో దూసుకుపోతుంది..!!