ఆస్తమా పేషంట్‌ల‌కు ఈ ఆహారంతో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయని తెలిసా..?

ఆస్తమా అనేది ఓ దీర్ఘకాలిక శ్వాసకోస సమస్య అన్న సంగతి అందరికీ తెలుసు. ఇక శీతాకాలంలో అయితే ఆస్తమా పేషెంట్లకు మరింత కష్టంగా అనిపిస్తుంది. వాతావరణం లో ఏర్పడే మార్పుల కారణంగా ఊపిరి సరిగ్గా ఆడక సతమతమవుతుంటారు. దగ్గు, ఛాతి పట్టేసినట్లుగా అయిపోతుంది. ఊపిరి ఆడక పోవడంతో చాలా ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ఆస్తమా సమస్యను కంట్రోల్ చేయడానికి మనం ఫుడ్ డైట్‌లో ఈ ఆహారాన్ని చేర్చుకుంటే సరిపోతుంది. ఈ ఆహారం తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఇంతకీ ఆ ఫుడ్ ఏంటో ఒకసారి చూద్దాం.

పసుపు
పసుపులో ఉండే యాంటీ ఇన్‌ఫ్ల‌మెంటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మన శరీరంలో ఇన్ఫెక్షన్‌లు రాకుండా చెక్ పెడతాయి. మనం రోజు కూరల్లో కాస్తంత పసుపుతో పాటు నిద్రపోయే ముందు వేడి వేడి పాలలో చిటికెడు పసుపును వేసుకుని తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.

అల్లం
అల్లం ఆస్త‌మా పేషంట్లకు దివ్య ఔషధంలా పనిచేస్తుంది. యాంటీ ఇన్‌ప్లిమెంటరీ గుణాలు.. శ్వాసకోశ సంబంధిత సమస్యలకు ఈజీగా చెక్ పెడతాయి. రోజుకోసారి అల్లం టీ తాగడం వల్ల ఆస్తమాకు రిలీఫ్ లభిస్తుంది.

ఆకుకూరలు
సీజన్ పరంగా దొరికే ఆకుకూరలు ఎప్పటికప్పుడు మన ఫుడ్ డైట్‌లో చేర్చుకుంటూ ఉండాలి. ఆకుకూరలను తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చాలా ప్రయోజనాలు చేకూరతాయి. ఆస్తమాకు కూడా రిలీఫ్ వస్తుంది. ఆకుకూరలు శీతాకాలంలో కూడా జీర్ణవ్యవస్థ మందగించకుండా కాపాడతాయి.