శ్రీలీల-మహేష్ ముద్దు సీన్ త్రివిక్రమ్ ఆ సినిమా నుండి లేపేశాడా..? ఫ్యాన్స్ కనిపెట్టేశారుగా..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు తాజాగా నటిస్తున్న సినిమా గుంటూరు కారం . త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి – శ్రీ లీల హీరోయిన్లుగా కనిపిస్తున్నారు . మొదట ఈ పాత్రలో పూజ హెగ్డేను అనుకున్నా కొన్ని కారణాల చేత ఆమెను తీసేసి ఆ ప్లేస్లోకి మీనాక్షి చౌదరిని తీసుకున్నారు . కాగా ఈ సినిమాకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ను మేకర్స్ర్ ఇలీజ్ చేశారు .

డిసెంబర్ 11వ తేదీ ఈ సినిమా నుండి ఓ బేబీ అనే పాట ప్రోమోని రిలీజ్ చేయబోతున్నామని.. డిసెంబర్ 13 ఈ సినిమాకి సంబంధించిన ఫుల్ పాటలు రిలీజ్ చేయబోతున్నామని చెప్పుకొచ్చారు . అంతేకాదు దీనికి సంబంధించిన ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో శ్రీ లీల మహేష్ బాబును గట్టిగా ముద్దు పెట్టుకుంటున్నట్లు కనిపిస్తుంది.

ఈ పోస్టర్ చూసిన జనాలకు గతంలో హీరోయిన్ సమంత – మహేష్ బాబు నటించిన దూకుడు సినిమా గుర్తొస్తుంది . ఆ సినిమాలో కూడా ఇలాగే సమంత – మహేష్ బాబును గట్టిగా ముద్దు పెట్టుకుంటుంది. ఆ పిక్చర్స్ ని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . మరికొందరు త్రివిక్రమ్ ఈ సీన్ ని అక్కడి నుంచి లేపేసాడు అంటూ ఘాటుగా కౌంటర్స్ వేస్తున్నారు. మొత్తానికి గుంటూరు కారం సినిమా పెద్ద హిట్ అయ్యేలానే ఉంది..!!