“సలార్” సినిమా సుపర్ డూపర్ హిట్.. తెగ బాధపడిపోతున్న మెగాస్టార్ చిరంజీవి.. ఎందుకో తెలుసా..?

తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తలచిందా..? అన్న రేంజ్ లో తయారైపోయింది మెగా హీరో చిరంజీవి పరిస్థితి . ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి అంచనా వేస్తే ఆ సినిమా ఖచ్చితంగా హిట్టా పట్టా అని ముందుగానే చెప్పేసేవాళ్ళు . మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా రిజెక్ట్ చేస్తే అది కచ్చితంగా ఫ్లాప్ అవుతుంది అంటూ అనుకునేవాళ్లు . అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి స్టామినా తగ్గిపోయింది .. బహుశా వయసు పెరిగిపోతూ ఉండడంతోనో.. లేకపోతే కొత్త డైరెక్టర్ అంచనాలను చిరంజీవి అందుకోలేకపోతున్నాడో తెలియదు కానీ .. ఆయన రిజెక్ట్ చేసిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి .

గతంలో ఆయన ఎంతో హిట్ అవుతుంది అనుకున్న ఆచార్య బొక్క బోర్లా పడేలా చేసింది. ఇప్పుడు అసలు ప్లాప్ అవుతుంది అనుకున్న సలార్ సూపర్ డూపర్ హిట్ అయింది . ఎస్ ప్రశాంత్ నీల్ సలార్ కథను ముందుగా రామ్ చరణ్ కు వివరించారట . ఆయన కోసమే ఈ సినిమాను కంప్లీట్ చేసుకున్నారట. కానీ మెగాస్టార్ చిరంజీవి విని ఇది చరణ్ బాడీకి సూట్ అవ్వదు అని అంత మాస్ యాంగిల్ తెలుగు హీరోస్ చేస్తే బాగోదేమో అని యాష్ కాబట్టి కేజిఎఫ్ పాత్రకు సెట్ అయ్యాడు కానీ మా తెలుగు హీరోలు ఇలాంటి మాస్ లుక్స్ కి పనికిరారు అంటూ ఈ పాత్రను చేయకుండా అడ్డుపడ్డారట.

ఆ తర్వాత ప్రశాంత్ నీల్ ఈ లైన్ ని తీసుకెళ్లి ప్రభాస్ కు వినిపించగా ఆయనకు నచ్చేసిన సినిమా కాల్ షీట్స్ బుక్ చేసేసాడు. దీంతో బిగ్ బ్లాక్ బస్టర్ సినిమా చరణ్ ఖాతాలో కాకుండా ప్రభాస్ ఖాతాలో పడిపోయింది ఇది తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ డీలా పడుతుంటే మరికొందరు చిరంజీవి తప్పు చేశాడేమో అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు..!!