నాగ్ ” నా సామి రంగ ” మూవీ నుంచి అంజిగాడు వచ్చేసాడోచ్… అల్లరి నరేష్ ఆ మజాకానా (వీడియో)

కింగ్ నాగార్జున హీరోగా.. విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కుతున్నలేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” నా సామి రంగ “. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి నెలలో గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాలో అల్లరి నరేష్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమాలో అల్లరి నరేష్ అంజి పాత్రలో ఆడియన్స్ ని ఓ రేంజ్ లో అలరించనున్నాడట. ఇక ఈ పాత్రకి సంబంధించిన ఇంట్రో గ్లింప్స్ ను మేకర్స్ నేడు రిలీజ్ చేశారు. ఇక ఈ వీడియోలో అల్లరి నరేష్ సూపర్ ఎనర్జిటిక్ గా ఉన్నాడు. ఇక కింగ్ నాగార్జున తో ఉన్న సన్నివేశాలు ప్రేక్షకులని మరింత ఆకట్టుకున్నాయి.

ఇక మరోసారి అల్లరి నరేష్ తనదైన మార్క్ ను ఈ అంజి పాత్రతో మేల్కొల్పనున్నట్లు తెలుస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతుంది‌.