విడాకులు తీసుకోబోతున్న ఐశ్వ‌ర్యరాయ్ – అభిషేక్‌బ‌చ్చ‌న్‌.. క్లారిటీ ఇదే..

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ – అభిషేక్ బచ్చన్ జంటకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ టాప్ సెలబ్రిటీస్ జంటలో ఈ జంట కూడా ఒకటి. ఇక ఈ జంట విడిపోయారంటూ చాలా కాలంగా న్యూసులు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. బచ్చన్ కుటుంబంలో గొడవలు ఉన్నాయని సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. జయా బచ్చ‌న్‌తో కోడలు ఐశ్వర్యరాయ్ కి అసలు పడడం లేదని.. అమితాబ్ కుమార్తె శ్వేతా బచ్చన్ నంద, ఐశ్వర్యరాయ్ మధ్యన ఈగో ఇష్యూస్ వస్తున్నాయని.. పచ్చగడ్డి వేస్తే భగ్గుమ‌నేంత‌ల మ‌న‌స్ప‌ర్ద‌లు త‌లెత్తాయ‌ని రకరకాల వార్తలు వినిపించాయి.

The love story of Aishwarya Rai and Abhishek Bachchan | Times of India

అయితే వీరిద్దరూ విడిపోయారు అంటూ వచ్చిన వార్తలపై ఈ జంట స్పందించలేదు. పైగా ఎటువంటి పబ్లిక్ ఔటింగ్ లోను వీరు పెద్దగా కనిపించలేదు. కానీ తాజాగా ఓ కీలక ఈవెంట్లో వీరిద్దరూ కలిసి జంటగా కనిపించారు. దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు అంటూ వచ్చే వార్తలకు చెక్ పెట్టినట్లయింది. ఈ జంట తమ కుమార్తె ఆరాధ్య బచ్చన్ తో కలిసి దీ ఆర్చీస్ ప్రీమియర్‌కు హాజ‌ర‌య్యారు. వారి కుటుంబంతో ఈవెంట్లో మెరిసి అందరినీ ఆకట్టుకున్నారు. అమితాబచ్చన్, ఆరాధ్య కూడా ఐశ్వర్య – అభిషేక్‌లతో కలిసి ఫోజ్‌లు ఇచ్చారు. కాగ ఆగస్త్య నంద సినిమా దీ ఆర్చీస్ ప్రీమియర్ కోసం వచ్చిన ఈ కుటుంబం.. కలిసి రావడం పై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి.

Aishwarya Rai Calls Shweta Bachchan's Son Agastya To Pose With Her, Abhishek  Bachchan; Video Goes Viral - News18

మొదట అభిషేక్ – ఐశ్వర్య విడాకులు తీసుకున్నట్లు అనుమానం వస్తుంది.. వారిని చూడండి అంటూ ఓ నెటిజ‌న్ కామెంట్ చేయగా.. మరో వ్యక్తి ఐశ్వర్య అసలు ఆరాధ్యను కూడా పట్టించుకోవడం లేదు అంటూ కామెంట్ చేశారు. ఐశ్వర్య – అభిషేక్ విడాకులు తీసుకోరని నేను భావిస్తున్న అంటూ మరొకరు మాట్ఆడారు.. ఇలా అంద‌రు నోరు తెరిచి ఐశ్వర్య – అభిషేక్ విడాకుల గురించి చర్చించడం మొదలుపెట్టారు. దీంతో ప్రస్తుతం ఐశ్వర్య – అభిషేక, ఆరాధ్య, అమితాబ్‌తో కలిసి వచ్చిన ఈవెంట్ వీడియోతో పాటు.. ఈ వీడియో పై మొదలైన ఇంట్రెస్టింగ్ చర్చలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)