నాలుగేళ్ళు సిన్సియ‌ర్‌గా ప్రేమిస్తే న‌న్ను మోసం చేశాడు..న‌టి కామెంట్స్ వైర‌ల్‌..

ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా కొనసాగుతున్న వారందరూ ఎంతో హ్యాపీ లైఫ్ ని, లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారని సాధారణ ప్రజలు భావిస్తూ ఉంటారు. అయితే సాధారణ ప్రజలలాన్నే సినీ సెలబ్రిటీస్ కూడా తమ పర్సనల్ లైఫ్ లో ఎన్నో రకాల బాధలను అనుభవిస్తూ ఉంటారు. అలా తాను కూడా పర్సనల్ లైఫ్ లో ఎంతో వేదనకు గురయ్యారని.. లవ్ లో ఫెయిల్ అయినప్పుడు జీవితం అంటే ఏంటో తెలుసుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది బాలీవుడ్ నటి యశశ్రీ మాసూర్కర్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ మాట్లాడుతూ నేను ఇండస్ట్రీకి చెందిన ఒక అబ్బాయిని నాలుగేళ్లుగా పిచ్చిగా ప్రేమించాను.. అతను యాక్టర్ కాదు.. అయితే అందరి అమ్మాయిలాగే నేను కూడా మా బాండింగ్ ఎంతో స్ట్రాంగ్ అని మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని భావించాను అంటూ వివ‌రించింది.

Yashashri Masurkar is the negative lead in Star Plus' Aarambh

కానీ అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే అది లైఫ్ ఎందుకు అవుతుంది.. ఒక రోజు అతను నా హార్ట్ బ్రేక్ చేశాడు. నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు. సడన్గా నా దగ్గరికి వచ్చి నాకు నిను పెళ్లి చేసుకోవాలని లేదు.. అసలు నాకు పెళ్ళి అంటేనే నమ్మకం లేదు అంటూ బాంబ్ పేల్చాడు. నాలుగేళ్లు మా ప్రేమ ప్రయాణానికి ఎండ్ కార్డ్ పడింది. అయితే నాలుగేళ్లు పిచ్చిగా ప్రేమించిన నేను సడన్గా అతను అలా చెప్పడంతో పిచ్చిదాన్ని అయిపోయా. అతనికి పని దొరకని టైం లో నేను ఎంతో హెల్ప్ చేశా.. తనతో కలిసి కష్ట,సుఖాలను పంచుకున్న. అలాంటిది ఇలా సడన్గా బ్రేకప్ అన‌డంతో అసలు యాక్సెప్ట్ చేయలేకపోయాను అంటూ చెప్పుకొచ్చంది.

Yashashri Masurkar Embraces her Role in 'Dabangii: Mulgii Aayi Re Aayi' and  Reflects on Industry Changes - TellyUpdates.News

కానీ తర్వాత అసలు ఇలా నేను ఒక‌రికోసం డిప్రెషన్ లోకి వెళ్లే అంత ఛాన్స్ వాళ్ళ‌కి ఎందుకు ఇచ్చాను అని ప్రశ్నించుకున్న.. ఓ తప్పుడు వ్యక్తిని ప్రేమించడం నా మిస్టేకే అని అర్థమైంది. ఇక పెళ్లి జోలికి లైఫ్లో వెళ్ళకూడదని డెసిషన్ తీసుకున్నాను అంటూ వివరించింది. ఇప్పుడు నేను చాలా ఫ్రీడమ్ గా ఉన్నాను. నిజంగా ఒకరిని ప్రేమించి.. ప్రేమ, పెళ్లి అంటూ బాధపడడం కన్నా సింగిల్ గా ఉండటమే చాలా బెటర్ అంటూ చెప్పుకొచ్చింది యశశ్రీ మసూర్కర్. ఇమె లాల్ ఇష్క్, కబద్‌: ద కాయిన్ లాంటి సినిమాలలో నటించింది. అయితే వెండితెర కంటే బుల్లితెర పైన ఎక్కువగా సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ పలు సీరియల్స్ లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ద‌బాంగి: ముల్గీ ఆయరే ఆయి సీరియల్స్ లో యాక్ట్ చేస్తుంది. ఈమె గతంలో మరాఠీ బిగ్‌బాస్ 4 సీజన్ లో కూడా సందడి చేసింది.