ఎర్ర కోక.. నల్ల జాకెట్ .. నాటు మాస్ లుక్ లో ఇరగదీసిన శ్రీలీల.. మహేశ్ కూడా టెంప్ట్ అయిపోయాడే..!!

ఇది కథ మహేష్ బాబు అభిమానులు వెయిట్ చేసే అప్డేట్ .. ఇన్నాళ్లు గుంటూరు కారం సినిమా నుంచి వచ్చిన అప్డేట్ అంతా చాలా చెత్తగా..చాలా అన్ కంఫర్టబుల్గా మహేష్ బాబు అభిమానులకు అనిపించాయి . రిలీజ్ అయిన ఒక్క సాంగ్ కూడా అభిమానులకు నచ్చలేదు . దానికి తోడు ట్రోలింగ్ . దానికి తోడు సినిమా షూట్ వాయిదా పడడం.. ఇలా ఒకదాని తరువాత ఒకటి మహేష్ బాబు ఫ్యాన్స్ కు భలే విసుగు తెప్పించాయి.

అయితే ఈసారి ఇచ్చిన త్రివిక్రమ్ అప్డేట్ మాత్రం గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. మహేష్ బాబు నటించిన గుంటూరు కారం నుంచి మాస్ మసాలా సాంగ్ రాబోతుంది అంటూ అఫీషియల్ గా ప్రకటించింది గుంటూరు కారం టీం. దీనికి సంబంధించిన పోస్టర్ ని కూడా రిలీజ్ చేసింది. ఈ పోస్టర్లో మహేష్ బాబు శ్రీ లీల మహా మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. ఎర్రకోకతో నల్ల జాకెట్ తో చేతికి నలుపు రంగుల గాజులతో ఊర నాటు పిచ్చెక్కించే మాస్ లుక్ లో కనిపించింది శ్రీలీల .

మహేష్ కూడా ఊర నాటు మాస్ స్టెప్స్ వేసే విధంగానే ఉన్నాడు అంటూ పోస్టర్ ఆధారంగా తెలిసిపోతుంది . అంతేకాదు వీళ్ళిద్దరూ వేసిన స్టెప్స్ కి థియేటర్స్ లో అరుపులు కేకలు కన్ఫామ్ అంటున్నారు మేకర్స్ . అంతేకాదు ఈ సినిమాలో శ్రీ లీల అందానికి మహేష్ బాబు మెల్ట్ అయిపోయి ఓ పాట పాడుతాడు అంటూ కూడా ప్రచారం జరుగుతుంది . ప్రెసెంట్ ఈ అప్డేట్ మహేష్ అభిమానులకి ఫుల్ మిల్స్ అందిస్తుంది..!!