టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడు ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ భాషలో అయినా సరే ఒదిగిపోయి నటిస్తూ ఉంటారు.. ఈ మధ్యకాలంలో అడపాదప సినిమాలలో నటిస్తూ ఉన్నారు ప్రకాష్ రాజ్. రాజకీయాల పరంగా కూడా నిలదోక్కుకోవడానికి పలు రకాల ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ట్విట్టర్ వేదికగా బిజెపి పైన ఎప్పుడు విరుచుకుపడుతూ ఉంటారు ప్రకాష్ రాజు.. గడిచిన రెండు సంవత్సరాల క్రితం మా ఎన్నికలలో నిలబడి మంచి విష్ణు చేతిలో చాలా ఘోరంగా ఓడిపోయారు.
మెగా కుటుంబం సపోర్టు ఉన్నప్పటికీ మా ప్రెసిడెంట్ కాలేకపోవడం జరిగింది. మంచి విష్ణు ప్రెసిడెంట్ అయ్యాక గెలుపు ఓటములు సర్వసాధారణమే ప్రెసిడెంట్ ని సైతం హామీలు నెరవేర్చకపోతే అడిగే హక్కు ఉంటుందని తెలిపారు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ చెప్పినట్టుగానే మంచు విష్ణు పైన ఫైర్ కావడం జరుగుతోంది. మంచు విష్ణు మా ప్రెసిడెంట్ అయి రెండేళ్లు అవుతున్న కానీ ఆయన పనితీరు 0 అంటూ తెలియజేశారు.. తాజాగా ఒక మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ రెండేళ్లు అయిపోయాయి కనీసం ఒక జనరల్ బాడీ మీటింగ్ కూడా పెట్టలేదంటూ తెలిపారు.
అంతేకాకుండా మా సొంత భవనం కూడా లేదని విష్ణు ని ఎన్నుకున్న సభ్యులందరూ కూడా ఇప్పుడు ఒకసారి ఆలోచించాలి బోగస్ ఓట్లు అలాగే బయటి నుంచి వచ్చిన చాలామంది ఓట్లు వేయడం వల్ల అతను గెలిచారని తెలిపారు..మంచు విష్ణు ఈ రెండేళ్లలో చేసింది ఏమీ లేదు.. అంటూ ప్రకాష్ రాజ్ ఫైర్ కావడం జరిగింది. పలువురు సెలబ్రిటీలు సైతం ఈ వాక్యాలు ఏకీభవిస్తుండగా మరికొంతమంది ఈ వాక్యాలను సైతం ఖండిస్తున్నారు మరి మంచు విష్ణు ఎలా స్పందిస్తారో చూడాలి.