ప్రపంచంలోనే ఆ ఒక్క వస్తువు షారుఖ్ సాంతం.. ఏమిటంటే..?

బాలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన షారుక్ ఖాన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఇటీవల కాలంలో వరుస విజయాలతో అభిమానులను సంబరపడేలా చేస్తూ ఉన్నారు.. అయితే ప్రపంచంలో ఎవరి దగ్గర లేనిది కేవలం షారుఖ్ ఖాన్ దగ్గర మాత్రమే ఒక వస్తువు ఉన్నదట. వాటి గురించి తెలుసుకుందాం.. లిమోసిన్ కారు.. ప్రపంచంలోనే చాలా పొడవైన కారు ఇది ఎక్కువగా హాలీవుడ్ చిత్రాలలో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది.ఇండియాలో చూడడం చాలా అరుదుగా ఉంటుంది.. ఈ కారుని ఎక్కువగా హాలీవుడ్లో బ్యాచిలర్ పార్టీ లేదా విలాసవంతమైన జీవిన శైలిలో చూపించడానికి మాత్రమే ఈ పొడవైన లిమోసిస్ కారును ఉపయోగించడం జరుగుతుంది.

అయితే ఈ కారులో కూర్చొని హాయిగా పార్టీ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇండియన్ రోడ్లపై కూడా ఈ లిమోసిస్ కార్లు తిరగడానికి అనుమతి లేకపోవడం జరిగింది. అయితే ఇలాంటి కారు కేవలం ఒక్క హీరో వద్ద మాత్రమే ఉన్నది.. అతడు ఎవరో కాదు బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్.. నటనపరంగా వ్యాపార పరంగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న షారుఖ్..VFX స్టూడియోను కూడా కలిగి ఉన్నారు. అలాగే వివిధ ప్రాంతాలలో విలాసవంతమైన ఇళ్లను కూడా కలిగి ఉన్నారు షారుక్ ఖాన్.

ఎన్నో బ్రాండ్లకు అంబాసిడర్ గా ఉన్న షారుఖ్ 2014లో లిసిస్ అనే కారుని కొనుగోలు చేశారు. తన కుటుంబంతో కలిసి ప్రయాణించడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు.ఈ లిమోసిస్ కారుకు ప్రధాన మోడీకి చాలా ప్రత్యేకమైన అనుబంధం ఉంటుందట .ఎందుకంటే 2018లో కామన్వెల్త్ సబ్మిట్ కు ప్రధాని హాజరు అయినప్పుడు ఆయన హోటల్ నుంచి ఈవెంట్ జరిగే ప్రాంతానికి ఈ లగ్జరీ కారులోనే వెళ్ళినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత 2014లో షారుఖ్ ఖాన్ కుటుంబం దుబాయ్ రాజు కుటుంబాన్ని కలవడానికి ఈ కారును ఉపయోగించారట. నిజానికి చాలామంది స్టార్ హీరోస్ సైతం వీటిని కొనాలని చూసిన భారత ప్రభుత్వం ఈ కార్లను తిప్పడానికి అనుమతి ఇవ్వలేదట.