” బిగ్ బాస్ ” హౌస్ లో ఫుడ్ పై ఆట సందీప్ సంచలన కామెంట్స్… మరి ఇంత దారుణంగా చెప్పేసాడు ఏంట్రా బాబు…!!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే షోలలో నెంబర్ వన్ స్థాయిలో నిలిచిన షో బిగ్ బాస్. ఇప్పటికే ఆరు సీజన్లు కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్.. ప్రస్తుతం ఏడో సీజన్ తో దూసుకుపోతుంది. ఉల్టా పుల్టా అంటూ నిర్వహించిన ఈ షో.. ఇప్పటికే 10 వారాలు పూర్తి చేసుకుని మరింత రసవత్తరంగా మారింది. ఇక ఈ సీజన్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగిన సందీప్ మాస్టర్… ఎనిమిదో వారంలో నే హౌస్ నుంచి బయటకు వచ్చేసాడు.

ఇక బయటకు వచ్చిన ప్రతి కంటెస్టెంట్ పలు ఇంటర్వ్యూలకు హాజరైనట్లే.. సందీప్ కూడా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. హౌస్ లో ఎక్స్పీరియన్స్ షేర్ చేశాడు. సందీప్ మాట్లాడుతూ..” బిగ్బాస్ హౌస్ల్‌ లో బ్రేక్ ఫాస్ట్ వచ్చేది కాదు. నైట్ ఏదన్నా మిగిలినప్పుడు దానిని ఫ్రిజ్లో పెట్టుకుని.. మరుసటి రోజు తినేవాళ్లం. కానీ నాకు ఉదయం పూట రైస్ తినే అలవాటు లేదు.

అందుకని రైస్ కు బదులుగా ఏదో ఒక ఫ్రూట్ తినేవాడిని. ఇక ఫుడ్ కు కావాల్సిన గ్రోసరీ కూడా రాదు. ఉన్నదాంట్లోనే అడ్జస్ట్ చేసుకుని తినాలి. బిస్కెట్ ప్యాకెట్, బ్రెడ్ ఇలా అన్నీ కూడా సరి పెట్టుకోవాల్సిందే. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత 12 కిలోలు తగ్గాను ” అంటూ పేర్కొన్నాడు. ప్రస్తుతం సందీప్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.