ఎన్నో ఏళ్లపాటు తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగించింది శ్రియా. దాదాపుగా అందరు స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో అద్భుతమైన విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఎందరో అభిమానులను కూడా సంపాదించింది ఈ ముద్దుగుమ్మ. వెండితెర పై తన విలక్షణమైన నటనతో పాటు, తన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ అప్సరస. కేవలం తెలుగు చిత్రాలలో మాత్రమే కాకుండా, తమిళ, కన్నడ భాషలలో కూడా అనేక చిత్రాలలో నటించింది శ్రేయ. ఈ మధ్యకాలం లో ఈమె అందం కన్నా, తన నటనకు ప్రాధాన్యం ఇచ్చే పాత్రలను ఎంచుకోవడం మొదలుపెట్టింది. కబ్జా, ఆర్ ఆర్ ఆర్, దృశ్యం 2 వంటి చిత్రాలలో తన అందాన్ని వెనక్కి నెట్టి, తనలోని నటిని బయటకు తెచ్చింది ఈ భామ.
ఐతే వెండితెర పై అందాలను చూపించడం తగ్గించిన ఈ భామ, సోషల్ మీడియాలో మాత్రం ఇంకా సెగలు పుట్టిస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ద్వారా ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది శ్రేయ. ఆమె షేర్ చేసిన కొద్దీ సమయంలోనే ఆ ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా శ్రేయ కొన్ని హాట్ పిక్స్ ను సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. ఈ పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోస్ లో వైట్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ మరియు మాచింగ్ లెహంగా తో దర్శనిమిచ్చింది ఈ బ్యూటీ.
నడుము, ఎద అందాలు ఎక్స్‌పోజ్ అయ్యేలా ఉన్న ఈ హాట్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. వీటితో పాటు శ్రేయ దీపావళి సందర్భంగా తన కుటుంబంతో తీసుకున్న ఫోటోలను కూడా షేర్ చేసింది. శ్రేయ 2018 లో అంద్రెయ కొసఛీవ్ అనే రష్యన్ యువకుడ్ని ప్రేమించి పెళ్లాడిన విషయం మనందరికీ తెలిసినదే. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. ఈ ఫోటోలలో ఆమె తన భర్త, కూతురితో కలిసి కనిపించింది. శ్రేయా ఈఏడాది దృశ్యం 2, కబ్జా, మ్యూజిక్ స్కూల్, నరకాసూరం చిత్రాలలో నటించింది.