సచిన్ రికార్డ్ బ్రేక్ చేసిన కోహ్లీ.. ప్రశంసలు కురిపిస్తున్న సినీ ప్రముఖులు..

ఐసీసీ వరల్డ్ కప్ వన్డే క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. క్రికెట్ ప్రియులంతా ఈ మ్యాచ్‌లు చూడడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఇక తాజాగా నిన్న ఇండియా – న్యూజిలాండ్ మధ్యన జరిగిన క్రికెట్ మ్యాచ్లో వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యధిక శతకాలు చేసిన సచిన్ టెండూల్కర్(49) రికార్డును విరాట్ కోహ్లీ బ్రేక్ చేశాడు. 50 శతకాలను పూర్తి చేసి విజయోత్సవాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా దీనిపై చాలామంది సినీ ప్రముఖులు స్పందించారు. నెట్టెంట‌ ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. ప్రశంసల వర్షం కురిపించారు. విరాట్ కోహ్లీకి శుభాకాంక్షలు తెలిపారు.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, విక్ట‌రి వెంక‌టేష్‌, సాయి ధరమ్ తేజ్‌ల‌తో పాటు పలువురు ప్రముఖ నిర్మాణ సంస్థలు ఎక్స్ వేదిక ద్వారా కోహ్లీని అభినందించారు. రాజమౌళి విరాట్ సక్సెస్ గురించి మాట్లాడుతూ రికార్డులనేది బద్దలు కొట్టేందుకే.. కానీ సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ తర్వాత అత‌డి రికార్డ్ బ్రేక్ చేస్తార‌ని ఎవరూ ఊహించలేదు.. ఇప్పుడు కోహ్లీ ఆ రికార్డు బ్రేక్ చేశాడు. అంటూ రాసుకొచ్చాడు. వెంకటేష్ మాట్లాడుతూ ఈరోజు వాంఖ‌డే స్టేడియంలో కొత్త హిస్టరీ క్రియేట్ అయింది అంటూ రాసుకోచ్చాడు. ఎన్టీఆర్ స్పందిస్తూ వన్డే ప్రపంచ కప్ 49 శతకాలు తిరుగులేని రికార్డును ఓ భారతీయుడు బ్రేక్ చేశాడు. అది ఇండియన్ వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో.. కంగ్రాట్స్ కోహ్లీ అంటూ అభినందించాడు.

సాయి ధరంతేజ్ అప్పుడు ఒక గాడ్, ఇప్పుడు ఓన్లీ కింగ్.. సచిన్, కోహ్లీ అంటూ కంగ్రాట్స్ కోహ్లీ అని తేజ్ ట్విట్ చేశాడు. అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, డివివి ఎంటర్టైన్మెంట్స్ కూడా విరాట్ కోహ్లీ అభినందించాయి. ముంబై వేదికగా భారత్ – న్యూజిలాండ్ సెమీఫైనల్‌లో టీమ్ పోటిపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 50 సెంచరీలు దాటేసాడు. దాంతో వన్డే హిస్టరీలోనే 50 సెంచరీలు బాదిన ఏకైక క్రికెట‌ర్‌గా కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఇక ఆటను చూసేందుకు నిన్ను ప్రముఖ హీరో రజనీకాంత్, హీరోయిన్ కియారి అద్వానీ తదితరులు పాల్గొన్నారు.