ఆ హీరోపై మ‌ళ్లీ మ‌న‌సు పారేసుకున్న త్రిష‌.. నా కోరిక ఎప్ప‌టికి తీరుతుందో అంటూ హాట్ కామెంట్స్‌!

దాదాపు రెండు ద‌శాబ్దాల నుంచి సౌత్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ గా చ‌క్రం తిప్పుతున్న చెన్నై సుంద‌రి త్రిష.. ఇప్ప‌టికీ త‌గ్గేదే లే అంటూ దూసుకుపోతోంది. స్టార్ హీరోల సినిమాలే కాకుండా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లోనూ న‌టిస్తూ దూసుకుపోతోంది. ఇటీవ‌లె ఈ బ్యూటీ `లియో` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. దాదాపు 14 ఏళ్ల‌ గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ ద‌ళ‌ప‌తి విజ‌య్ తో వెండితెర‌పై సంద‌డి చేసింది.

పొన్నియిన్ సెల్వన్ సిరీస్ తో డ‌బుల్ హిట్స్ అందుకున్న త్రిష‌.. లియో మూవీతో మ‌రో హిట్ ఖాతాలో వేసుకుని హ్యాట్రిక్ కొట్టేసింది. అయితే తాజాగా చెన్నైలో లియో మూవీ స‌క్సెస్ మీట్ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో త్రిష చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. త్రిష మాట్లాడుతూ.. `నా సినీ కెరీర్‌లో ఎక్కువ సినిమాలు విజ‌య్ తోనే చేశాను. కొన్నేళ్ల విరామం తర్వాత స్కూల్‌ ఫ్రెండ్స్‌ కలిస్తే ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో విజయ్‌తో లియో చేస్తుంటే అలాంటి ఫీలింగే కలిగింది.

ఎంత పెద్ద స్టార్ అయినా విజ‌య్ చాలా సింపుల్ గా ఉంటాడు. వ‌ర్క్ ప‌ట్ల అత‌ను పెట్టే ఎఫెర్ట్‌ వేరెవరిదగ్గరా నేను చూడలేం. నా చిరకాల మిత్రుడితో మళ్లీ ఓ సినిమా చేయాలనుంది. ఆ కోరిక ఎప్ప‌టికి తీరుతుందో` అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి విజ‌య్ పై త్రిష మ‌ళ్లీ మ‌న‌సు పారేసుకుంద‌ని ఆమె వ్యాఖ్య‌ల బ‌ట్టి స్ప‌ష్టంగా తేలిపోయింది. మ‌రి విజ‌య్ మ‌రోసారి త్రిష‌కు ఛాన్స్ ఇస్తాడో.. లేదో.. చూడాలి.