ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్ సెవెన్ రసవతరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఏడో సీజన్ సక్సెస్ఫుల్‌గా 9 వ వారం వరకు వచ్చింది. ఇందులో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు టాస్క్ ఇచ్చి వారి స్టామినాను టెస్ట్ చేస్తున్నాడు. అయితే తొమ్మిదవ వారం కెప్టెన్సీ టెస్ట్ కొనసాగుతుంది. ఇందులో హాల్ ఆఫ్ బాల్ అనే టాస్క్ ను బిగ్ బాస్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే కంటెస్టెంట్స్ ను రెండు గ్రూపులుగా బిగ్‌బాస్ డివైడ్ చేశాడు. యావర్, గౌతమ్, బోలే, తేజ, శోభ, రతికలను వీర సింహాలు టీం గా.. అర్జున్, ప్రశాంత్, శివాజీ, అమర్, ప్రియాంక, అశ్విని గర్జించే పుల్లల టీముగా డివైడ్ చేశాడు. తొమ్మిదో వారానికి సంబంధించిన కెప్టెన్సిటీలో పాల్గొనే అర్హతను వీర సింహాలు టీం దక్కించుకున్నారు.
ఇక ఈ టీం వారికి గత సీజన్‌లో జరిగిన బీన్ బాగ్ టాస్క్ ను మళ్లీ ఇచ్చారు. అయితే ఇందులో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు. వీర సింహాలు టీం సభ్యులకు బదులుగా గర్జించే పులులు ఆడాల్సి ఉంటుందని తాజాగా విడుదలైన ప్రోమోలో బిగ్ బాస్ వివరించాడు. బిగ్ బాస్ చెప్పిన విధంగానే వీర సింహాలు టీం సభ్యులకు బదులుగా ఈ టాస్క్ ను గర్జించే ఫులుల సభ్యులైన శివాజీ, అమర్, బోలే, అశ్విని శ్రీ, ప్రియాంక ఆడారు. ఇందులో శోభ తరుపున ఆడిన అమరదీప్ బోలె, అశ్వినీలను టార్గెట్ చేస్తూ తనలోని వైల్డ్ యాంగిల్ చూపించాడు. అర్జున్ తరఫున శివాజీ ఆడాడు.
శివాజీ బ్యాగ్ ను అమర్ బలవంతంగా లాక్కునే క్రమంలో శివాజీ చేతికి మరోసారి తీవ్ర గాయం అయింది. అది గమనించిన తేజ శివాజీని వెంటనే మెడికల్ రూమ్‌కు తీసుకుని వెళ్ళాడు. ఆయనను చికిత్స కోసం వైద్యుల దగ్గరికి తీసుకువెళ్లగా ఆ తర్వాత మిగతా కంటెస్టెంట్లు ఆటను కంటిన్యూ చేశారు. ఇంతలో బిగ్ బాస్ నుంచి సెన్సేషనల్ అనౌన్స్మెంట్ వచ్చింది. శివాజీ శారీరకంగా సిద్ధంగా లేని కారణంగా ఈ టాస్క్ నుంచి తప్పుకుంటున్నాడు. అని చెబుతూ బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. అయితే శివాజీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో.. క్లియర్గా క్లారిటీ రావాలంటే ఈరోజు ఎపిసోడ్ వచ్చే వరకు వేచి చూడక తప్పదు.