కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో కార్తి త్వరలోనే `జపాన్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. రాజమురుగన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించింది. దీపావళి కానుకగా నవంబర్ 10న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థే విడుదల చేస్తుంది.
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమాను వాస్తవ సంఘటనలు స్ఫూర్తిగా తీసుకుని రూపొందించారు. ఇప్పటికే బయటకు టీజర్, ట్రైలర్లు సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశారు. మరోవైపు మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ కూడా నిర్వస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో జపాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. నాని స్పెషల్ గెస్ట్ గా విచ్చేశాడు.
ఈ కార్యక్రమంలో ఒక్కొక్కడికి సీటు కింద బాంబ్ పెడతానంటూ హీరో కార్తి మాస్ వార్నింగ్ ఇచ్చారు. అయితే సరదాగానేలేండి. జపాన్ కథ అందరికీ కనెక్ట్ అవుతుందని.. ఫన్ ఎలిమెంట్స్ తో నేటి సమాజాన్ని రిఫ్లెక్ట్ చేస్తుందని.. తప్పకుండా అందరూ చూడాలని కార్తి కోరారు. `జపాన్ స్టైల్లో చెప్పాలంటే.. రేయ్ మా సినిమా నవంబర్ 10న రాబోతోంది. ఎవడైనా థియేటర్‌కు రాలేదంటే సీటు కింద బాంబ్ పెడతాను` అంటూ అందరినీ నవ్వించేశారు. అలాగే గెస్ట్ గా వచ్చిన నానిపై పొగడ్తల వర్షం కురిపించాడు. మరోవైపు `మా అన్నయ్య` అంటూ నాగార్జునపై సైతం తన ప్రేమ, అభిమానాన్ని చాటుకున్నాడు.