మెగా డాటర్ నిహారిక – నాగచైతన్య కాంబోలో ఓ సినిమా మిస్సయిందా ..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది. అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోగా తెరంగేట్రం చేశాడు . ఆ తర్వాత హిట్లు ఫ్లాపులు అంటూ తేడా లేకుండా బోలెడన్ని సినిమాల్లో నటించాడు.
కాగా ఆయన ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా నటించిన సినిమా 100% లవ్ . ఇప్పటివరకు చైతన్యని మనం చూడని డిఫరెంట్ యాంగిల్ లో ఈ సినిమాలో చూస్తాం. అయితే ఈ సినిమాలో సుకుమార్ హీరోయిన్ తమన్నా కంటే ముందే నాగబాబు కూతురు నిహారికను హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేయాలి అంటూ ఆశపడ్డారట .
కానీ మెగా ఫ్యామిలీ అందుకు ఒప్పుకోలేదు. అప్పట్లో నిహారికకు హీరోయిన్ అవ్వాలన్న కోరిక ఉన్న ఎక్స్ప్రెస్ చేయలేకపోయిందట. ఆ కారణంగానే ఈ సినిమా ఓకే చేయలేకపోయింది . ఆ తర్వాత ఈ పాత్ర కోసం తమన్నాను తీసుకున్నారు . ఈ సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాలా..?