వరుణ్ తేజ్ అదో టైపు భర్త అంటూ లావణ్య హాట్ కామెంట్స్..

స్టార్ హీరోయిన్, మెగా కోడలు లావణ్య త్రిపాఠి చాలా నెలలుగా తన పెళ్లి ఏర్పాట్లు, వేడుకలతో బిజీగా గడిపింది. ఈ ముద్దుగుమ్మ ఇటలీలో అంగరంగ వైభవంగా తన చిరకాల ప్రియుడు వరుణ్ తేజ్‌ని పెళ్లి చేసుకుంది. ఈ జంట 2017లో ‘మిస్టర్’ చిత్రంలో కలిసి పనిచేస్తున్నప్పుడు ప్రేమలో పడ్డారు. వారు తమ లవ్‌ అఫైర్ ను చాలా సీక్రెట్ గా నడిపించారు. దాదాపు ఆరేళ్ల పాటు లో ప్రొఫైల్‌ను కొనసాగించారు. చివరకు వారు జూన్‌లో నిశ్చితార్థం చేసుకొని ఆశ్చర్యపరిచారు. అప్పటివరకు వారు లవ్ లో ఉన్నట్లు ఎవరూ నమ్మలేకపోయారు.

నవంబర్ 1న వరుణ్, లావణ్య ఇటలీలో డ్రీమీ డెస్టినేషన్ వెడ్డింగ్‌ని వారి సన్నిహిత కుటుంబం, స్నేహితుల సమక్షంలో చేసుకున్నారు. బంధువులు, శ్రేయోభిలాషులతో ఆనందాన్ని పంచుకోవడానికి వారి స్వస్థలమైన హైదరాబాద్, డెహ్రాడూన్‌లలో గ్రాండ్ రిసెప్షన్‌లను కూడా నిర్వహించారు.

పెళ్లి తర్వాత సోషల్ మీడియాకు దూరంగా ఉన్న లావణ్య తాజాగా తన పెళ్లికి సంబంధించిన కొన్ని అద్భుతమైన చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. తన ప్రేమను, కృతజ్ఞతలు తెలుపుతూ తన భర్త వరుణ్ తేజ్‌ కోసం స్వీట్ మెసేజ్ కూడా రాసింది.

‘నా భర్త నాకు తెలిసిన మోస్ట్ అమేజింగ్ హస్బెండ్‌. మోస్ట్ కేరింగ్‌, కైండెస్ట్ పర్సన్! నేను చెప్పడానికి చాలా ఉంది, కానీ దానిని మా మధ్యే ఉంచుకుంటా. ఈ రోజును చాలా ప్రత్యేకంగా చేసిన ప్రతి ఒక్కరికీ, మాకు శుభాకాంక్షలు పంపిన ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా. ధన్యవాదాలు.’ అని లావణ్య పేర్కొంది. లావణ్య చేసిన ఈ కామెంట్స్ తో పాటు ఆమె షేర్ చేసిన వెడ్డింగ్ పిక్స్ వైరల్ గా మారాయి.

 

View this post on Instagram

 

A post shared by Lavanya tripathi (@itsmelavanya)