“ఊరుకొండ్రా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్”.. స్క్రీన్ పై ఫోటో వేసింది అందుకే.. ఏం బుజ్జగింపు రా మావ ఇది..!!

ఈ మధ్యకాలంలో సినిమా ప్రమోషన్స్ కోసం కొందరి సిని మేకర్స్ హద్దులు మీరిపోతున్నారు. మరీ ముఖ్యంగా సినిమాకి అస్సలు సంబంధం లేని వ్యక్తుల ఫోటోలను వాడుకుంటూ సినిమాను పబ్లిసిటీ ప్రమోట్ చేసుకుంటున్నారు . తాజాగా అదే టీంలోకి యాడ్ అయిపోయింది “హాయ్ నాన్న” టీం. నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా డిసెంబర్ 7న గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది .

ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వైజాగ్ లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా ఘనంగా నిర్వహించారు . అంతా బాగున్న సడన్గా స్క్రీన్ పై ఈ సినిమాకి సంబంధం లేని వ్యక్తుల ఫోటోలను టెలికాస్ట్ చేశారు . విజయ్ దేవరకొండ రష్మిక మందన్నా ల మాల్దీవ్స్ ప్రైవేట్ పిక్చర్ ను స్క్రీన్ పై టెలికాస్ట్ చేయడంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఫైర్ అయిపోతున్నారు. సిగ్గు లేదా మీకు..? మీ పబ్లిసిటీ కోసం మరొక స్టార్ సెలబ్రిటీ జీవితంతో ఆడుకుంటారా ..? అంటూ ఘాటుగా స్పందిస్తూ వస్తున్నారు .

అయితే ఇలాంటి క్రమంలోనే నాని ఫాన్స్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ను కూల్ చేస్తున్నారు . “ఒరేయ్ అది పొరపాటున టెలికాస్ట్ అయిన పిక్చర్.. కావాలని ఎవ్వరూ చేయలేదు.. ఆయన ఒకందుకు అది మీకు మేలే ..వాళ్ళిద్దరూ నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారుగా మరెందుకు మీకు ఇంత ఆవేశం .. బుర్ర పెట్టి ఆలోచించండి రా బాబు” అంటూ వాళ్ళను కూల్ చేసే పనిలో పడ్డారు . అయితే హాయ్ నాన్న టీం చేసింది ముమ్మాటికి తప్పే .. అయినప్పటికీ నాని ఫాన్స్ ఇలా వాళ్ళని వెనకేసుకునిరావడం మిగతా హీరోల ఫ్యాన్స్ కి కూడా నచ్చడం లేదు . చూడాలి దీనిపై రష్మిక – విజయ్ దేవరకొండ ఏ విధంగా స్పందిస్తారో..?