“నాని అన్న ఎంత మంచోడో”..హాయ్ నాన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏం చేసాడో చూడండి..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా మంచితనానికి మరో మారుపేరుగా నాని పబ్లిసిటీ పాపులారిటీ దక్కించుకున్నాడు . ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి రావడమే గొప్ప అనుకుంటే వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ ప్రారంభించి .. ఆ తర్వాత హీరోగా మారి ఆ తర్వాత స్టార్ హీరోగా ఆ తర్వాత పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు మన నాని. తనపై నెగిటివ్గా రియాక్ట్ అయినా సరే పాజిటివ్గా ఆన్సర్ ఇచ్చే నాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా “హాయ్ నాన్న”.

ఫుల్ టు ఫుల్ ఫాదర్ డాటర్ సెంటిమెంట్తో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 7న రిలీజ్ కాబోతోంది . శర్యువ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. కాగా రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నాడు నాని . ఈ క్రమంలోనే వైజాగ్ లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో నాని మాట్లాడుతూ..” తన సినిమాను చూడండి అని చెప్తూనే తన ఫ్రెండ్స్ నటిస్తున్న సినిమాలు కూడా చూడండి ” అంటూ ప్రమోట్ చేశారు .

“దర్శకుడు సందీప్ రెడ్డివంగా తీసిన సినిమా అనిమల్ . డిసెంబర్ ఒకటిన రిలీజ్ కాబోతుంది . నా బెస్ట్ ఫ్రెండ్ నితిన్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ డిసెంబర్ 8న రిలీజ్ కాబోతుంది . మన అందరి డార్లింగ్ ప్రభాస్ అన్న సలార్ సినిమా డిసెంబర్ 22న రిలీజ్ కాబోతుంది. మీరు ఎలా ఈ సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారో..? నేను కూడా అలాగే వెయిట్ చేస్తున్న.. ఇక మనందరికీ ఇష్టమైన సుమ గారి కొడుకు రోషన్ బబుల్గం సినిమా కూడా రిలీజ్ కాబోతుంది ..ఈ అన్ని సినిమాలను మీరు చూసి ఆదరిస్తారు అని కోరుకుంటున్నాను ” అంటూ అన్ని సినిమాలకు ప్రమోషన్స్ చేసేసాడు నాని . దీంతో నాని ఎంత మంచోడో అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!