చావుకి వీసాతో ప‌నిలేదు.. సల్మాన్ కు మళ్లీ బెదిరింపులు.. అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు..!!

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. సల్మాన్ తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే సల్మాన్ కు మరోసారి బెదిరింపులు ఎదురయ్యాయి. ఈసారి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరిట ఉన్న ఫేస్బుక్ అకౌంట్ నుంచి.. సల్మాన్ కు డెత్ థ్రెట్ వచ్చింది. ఇక ఈ పోస్టులో సల్మాన్ తో పాటు పంజాబీ సింగర్ జీప్పీ గ్రేవాల్‌కు కూడా వార్నింగ్ ఇచ్చారు.

జిప్పీని ఉద్దేశిస్తూ..” నువ్వు సల్మాన్ ఖాన్ ని సోదరుడిగా భావిస్తావు. ఇప్పుడు నీ అన్న వచ్చి నిన్ను కాపాడాల్సిన సమయం వచ్చింది. ఈ మెసేజ్ నీకు మాత్రమే కాదు. సల్మాన్ కి కూడా. దావూద్ వచ్చి కాపాడుతాడని ఊహల్లో ఉండకు. నిన్ను సేవ్ చేయడానికి ఎవ్వరూ రారు. సిద్ధూ మూసేవాలా మరణం పై నువ్వు ఎలా స్పందించావో మేం చూశాం.

ఈ బెదిరింపు ట్రైలర్ లాంటిదే. అసలు సినిమా ముందుంది. నువ్వు ఏ దేశానికైనా వెళ్ళు. చావుకి వీసాతో ప‌నిలేదు అంటూ పోస్టులో రాసి ఉంది. అయితే ఈ ఖాతాకు లారెన్స్ ఫోటోనే డీపీ గా ఉండడంతో అది ఒరిజినల్ కాతాన లేక ఫేక్ అకౌంటా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక సల్మాన్ ను అప్రమత్తం చేసి మరింత బందోబస్తి ఏర్పాటు చేశారు పోలీసులు. ఇక సల్మాన్ కు మళ్లీ బెదిరింపులు రావడంతో ఈయన కుటుంబంతో పాటు అభిమానులు సైతం ఆందోళనలో పడ్డారు.