ఫినాలే పాస్ పేరుతో సీరియల్ బ్యాచ్ మధ్య చిచ్చు పెట్టిన బిగ్ బాస్..

బిగ్‌బాస్ సీజన్ సెవెన్ ఫైనల్ కు చేరుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక ఈవారం ఫినాలే పాస్ టాస్క్ రసవత్తరంగా కొనసాగింది. మంగళవారం నుంచి ఈ టాస్క్ మొదలైంది. అయితే ఈసారి చాలా కొత్తగా ఈ ఫినాలే పాస్ కోసం రకరకాల టాస్క్లను పెట్టాడు బిగ్‌బాస్. ఈ టాస్క్‌లో భాగంగానే లీస్ట్ పాయింట్లను సంపాదించుకున్న హౌస్ మేట్స్ తమకు వచ్చిన పాయింట్స్ వేరే హౌస్ మేట్స్ కి ఇచ్చేయాలని బిగ్‌బాస్ చెప్పాడు. అయితే అప్పటికే శివాజీ, శోభాశెట్టి ఇద్దరు లిస్ట్ పాయింట్స్ రాబట్టుకోగా తమ పాయింట్స్ అన్నిటిని అమర్‌కి ఇచ్చేశారు.

ఇక బుధవారం టాస్క్ లో ప్రియాంక లీస్ట్ పాయింట్స్ లో ఉంది. ఆమె పాయింట్స్ లో సగం మరొకరికి ఇవ్వాలని బిగ్ బాస్ ఆర్డర్ పాస్ చేశాడు. ఇక హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి అమర్‌దీప్, శోభాశెట్టి, ప్రియాంక ముగ్గురు మంచి క్లోజ్ ఫ్రెండ్స్‌గా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో అంతా అమర్‌కి.. ప్రియాంక తన పాయింట్స్ ఇస్తుందని భావించారు. అమర్ కూడా ఇదే ఆలోచనలో ఉన్నాడు. కానీ ప్రియాంక తన పాయింట్స్ గౌతంకి ఇచ్చి అమర్‌కి ఇచ్చింది. తనని కెప్టెన్ చేయడంలో గౌతమ్ హెల్ప్ చేశాడని.. గౌతంకి తన పాయింట్స్ లో సగం ఇస్తున్నట్టు ప్రియాంక చెప్పింది.

దీంతో అమర్ తన ఫ్రెండ్ తనకు ఇస్తుందని భావిస్తే గౌతంకు ఇచ్చింది అంటూ హర్ట్ అయ్యాడు. దీంతో శోభ, అమర్ ఇద్దరు ప్రియాంకపై కోపం తెచ్చుకున్నారు. అమర్‌కి.. ప్రియాంక నచ్చ చెప్పాలని చూసిన అతను కన్విన్స్ కాలేదు. ఈ నేపథ్యంలో శోభాశెట్టి వంట‌ప‌ని చేయాలని ప్రియాంకని పిలిస్తే లేటుగా రియాక్ట్ అయింది. దీంతో శోభ కూడా ప్రియాంకపై కోప్పడింది. ఇలా మొదటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉన్న వీరి ముగ్గురి మధ్యన బిగ్‌బాస్ చిన్న చిచ్చు పెట్టినట్లయింది. ఇక పోయిన వీకెండ్ల నాగార్జున ప్రియాంకని గ్రూప్ గేమ్ ఆడొద్దు అని హెచ్చరించాడు. దీంతో ఆమెలో మార్పు మొదలైంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజ‌న్లు.