hyderabad: క్యూలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్న బ‌న్నీ, తార‌క్‌..!!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ కాసేపటి క్రితమే ప్రారంభమైంది. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాధారణ పౌరులుగా క్యూలో నిలబడి ఈ స్టార్ హీరోలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఒక్కసారిగా స్టార్ హీరోలు ఓట్లు వేయడం కోసం క్యూలో నుంచోవడంతో.. ఇతర ఓటర్లు షాక్ అయ్యారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ వెంట ఆయన భార్య లక్ష్మీ ప్రణతి, తల్లి షాలిని నిల్చున్నారు. ఇక వీరితోపాటు కీరవాణి కుటుంబ సభ్యులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి క్యూలో నిలబడ్డారు.

అలాగే జూనియర్ ఎన్టీఆర్కు సెక్యూరిటీగా ఇరువైపుల సిబ్బంది ఉన్నారు. ఇక ఈ స్టార్ హీరోలను చూసేందుకు భద్రతా సిబ్బంది, ఓటర్లు ఆసక్తి చూపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తమ అభిమానులు…” మా హీరోలు ఎంత గొప్ప స్థాయిలో ఉన్న.. అనిగిమనిగి ఉంటారు ” అంటూ కామెంట్లు చేస్తున్నారు.