వంద రోజులు వర్షంలోనే షూట్ చేసిన నాగచైతన్య సినిమా.. ఏంటో తెలుసా..?

టాలీవుడ్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ 13B, ఇష్క్, మనం లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు టాలీవుడ్‌కు అందించాడు. తాజాగా నాగచైతన్య ప్రధాన పాత్రలో నటించిన దూత సిరీస్ విక్రమ్ రూపొందించిన సంగతి తెలిసిందే. ఇటీవల ధూత సీరీస్ ప్రమోషన్ లో భాగంగా పత్రికా విలేకరులతో చర్చించాడు ఈ డైరెక్ట‌ర్. దూత వెబ్ సిరీస్ కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకున్నాడు. 13B సినిమా తర్వాత ఇలాంటి తరహా కదలని రాయమని నన్ను చాలామంది అడిగారు.. అయితే ఇదే జానర్ డైరెక్టర్ అని నాపై ముద్ర పడుతుందేమో అని భావించి దానికి దూరంగా ఉన్న అంటూ చెప్పుకొచ్చాడు.

అయితే నాకు ఈ తరహా కథలను రాయడం అంటే ఇష్టం అంటూ చెప్పుకొచ్చాడు. వెబ్ సిరీస్ అవకాసం వచ్చినప్పుడు ఇన్నాళ్ళు నేను మిస్ అయిన సూపర్ నేచురల్ కథ‌ను సెలెక్ట్ చేసుకోవాలని భావించా.. అదే దూత. ఈ సిరీస్ కు రచనా పరంగా ఎపిసోడ్ చివ‌ర‌కు ఆసక్తి రేకెత్తించే విధంగా ముగించాలి. దానికోసమే కథను ఎంతో ఆస్వాదిస్తూ రాసా.. ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో అనే ఆతృత నాలో ఉంది అంటూ వివరించాడు. ఇక చైతన్యకు నాకు మంచి స్నేహం ఉందని.. మనం షూటింగ్ టైంలో ఆయనకు హారర్ కథ చెప్పానని వివ‌రించాడు.

నీగ చైత‌న్య మాత్రం నాకు దెయ్యం సినిమాలు అంటే చాలా భయం.. నేను చూడడానికి కూడా ఇష్టపడినట్టు చెప్పాడని.. దూత కథ మాత్రం చైత‌న్య‌కి చాలా నచ్చిందని.. ఇది భ‌య‌పెట్టే సినిమా కాదు.. ఇది ఎలా జరిగింది.. తర్వాత ఏం జరుగుతుందని.. ఉత్కంఠను రేకెత్తిస్తుంది అంటూ వివరించాడు. అయితే ఈ సినిమా స్టోరీ మొత్తం వర్షం నేపథ్యంలో సాగే కథ కావడంతో వంద రోజులు షూటింగు పూర్తిగా వర్షంలోనే షూట్ చేశారట. దీనిపై విక్రమ్ కె కుమార్ మాట్లాడుతూ శరత్‌మార‌ర్‌ లాంటి ప్రొడ్యూసర్ ఉండడం వల్లే ఇది సాధ్యమైంది అంటూ వివరించాడు.