మంత్రి మ‌ల్లారెడ్డి కామెంట్స్ పై డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి రియాక్ష‌న్ ఇదే.. ఎమ‌న్నాడంటే..?

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన హీరో హీరోయిన్లుగా నటిస్తున్న మూవీ యానిమల్. ఈ సినిమాకు అర్జున్ రెడ్డి ఫెమ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ బాలీవుడ్ తో పాటు.. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమా రేపు (డిసెంబ‌ర్ 1)న రిలీజ్‌కానుంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ హైదరాబాదులో గ్రాండ్ లెవెల్ లో జరిగాయి. ఈ ఈవెంట్లో సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకతీరుడు రాజమౌళి స్పెషల్ గెస్ట్‌లుగా హాజరైన సంగతి తెలిసిందే.

వీరితో పాటే మంత్రి మల్లారెడ్డి కూడా మరో స్పెషల్ గెస్ట్ గా ఈ ఈవెంట్లో హాజరయ్యాడు. అయితే ఈవెంట్లో మల్లారెడ్డి మాట్లాడిన కామెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. రణ్‌బీర్‌ కపూర్ గురించి ఆయన మాట్లాడుతూ.. రణ్‌బీర్‌ వినండి.. రానున్న 5 ఏళ్లలో తెలుగు వాళ్ళు బాలీవుడ్, హాలీవుడ్ ను ఏలుతారు. బాలీవుడ్ పని అయిపోయినట్లే.. ముంబై పాతదైపోయింది. బెంగళూరు ఏమో ట్రాఫిక్ జామ్.. మీరు హైదరాబాద్ వచ్చేయండి.. మా దగ్గర రాజమౌళి, దిల్ రాజు, సందీప్ రెడ్డి వంగ లాంటి తెలివైన వాళ్ళు ఉన్నారు.

ప్రస్తుతం తెలుగు వారి అశ్వమేధ యాగం జరుగుతోంది.. అంటూ కామెంట్స్ చేశాడు. ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారడంతో బాలీవుడ్ నుంచి చాలామంది సెలబ్రిటీస్ మల్లారెడ్డి పై ఫైర్ అయ్యారు. ఇక ఈ ఈవెంట్ జరిగిన తర్వాత తాజాగా సందీప్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో ఇంటర్‌వ్యూవర్ మాట్లాడుతూ మొన్న జరిగిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో మల్లారెడ్డి గారు చేసిన కామెంట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి.. రణబీర్ తో అలా మాట్లాడడం మీకు ఎలా అనిపించింది.. అంటూ ప్రశ్నించాడు.

దీనిపై సందీప్ స్పందిస్తూ మనకు తెలిసినంతవరకు ఆయన ఎప్పుడూ అలాగే మాట్లాడతారు. గతంలో ఆయన వేరే స్పీచ్ లను కూడా నేను చూశా. ఎప్పుడూ మల్లారెడ్డి గారు మాట విధానం అలాగే ఉంటుంది. ముఖ్యంగా ఆయన ఏజ్ అలాంటిది.. కాబట్టి ఆయన ఏం మాట్లాడినా.. అవి మనకు ఎంత ఇబ్బంది కలిగించిన.. మనమేం అనలేం అంటూ చెప్పుకొచ్చాడు. సందీప్ ప్రెసెంట్.. మల్లారెడ్డి కామెంట్స్ పై స్పందించిన‌ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.