ఫిట్నెస్ కోసం అనసూయ పడుతున్న పాట్లు చూస్తే మతి పోవాల్సిందే..!!

చాలామంది సెలబ్రిటీలు సైతం ఎక్కువగా జిమ్ వర్క్ అవుట్ లో వంటివి చేస్తూ ఉంటారు. ఏమాత్రం షేప్అవుట్ అయిన అవకాశాలు రావని ఉద్దేశంతోనే వీరు ఇలా చేస్తూ ఉంటారు.. బుల్లితెర హాట్ యాంకర్ గా పేరుపొందిన అనసూయ కూడా చూడడానికి కాస్త బొద్దుగా కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఎక్కువగా జిమ్ వర్కౌట్లు చేస్తూ వాటికి సంబంధించి ఫోటోలను షేర్ చేస్తూ ఉన్నది. సోషల్ మీడియాలో తరచు ఆక్టివ్ గా ఉంటూ తన వ్యక్తిగత విషయాల పైన డ్రెస్సింగ్ స్టైల్ పైన పలు విషయాలను తెలియజేస్తూ ఉంటుంది.

ముఖ్యంగా తన పైన ట్రోల్ చేసే వారికి కూడా గట్టి కౌంటర్ ఇస్తూ ఉంటుంది అనసూయ..బుల్లితెరకు దూరమై ఇటీవల సినిమాలలో ఫుల్ బిజీగా మారిపోయింది అనసూయ. రీసెంట్గా జిమ్ములో వర్కౌట్ చేస్తున్నటువంటి కొన్ని ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడం జరిగింది. నిన్నటి రోజున సరిహద్దులు దాటి ముందుకు వెళ్లిన రోజుగా గుర్తుండిపోతుంది అంటూ ఒక శీర్షికతో ఫోటోను సైతం షేర్ చేయడం జరిగింది. అందులో అనసూయ తాడుకు వేలాడుతూ తలకిందులుగా వేసిన ఆసనం ఫోటోని చూడవచ్చు.

ఈ ఫోటోలు చూసిన అభిమానులు నెట్టిజెన్స్ సైతం పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. జిమ్ వర్క్ అవుట్లతో పాటు అనసూయ యోగ చేస్తూ లేత కొబ్బరికాయను తింటూ ఉన్న ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ఇవన్నీ చూస్తూ ఉంటే అనసూయ ఫిట్నెస్ కోసం పడుతున్న పాట్లు చాలా కష్టంగా ఉన్నాయంటూ పలువురు నెటిజన్ సైతం కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి పలు రకాల ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)