100 కోట్ల ఉప్పెన..ఇద్దరు మునిగిపోయారా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన జోడి వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి… వీళ్ళు అదృష్టానికి తగ్గట్టుగా తన మొదటి సినిమా ఉప్పెనతో భారీ విజయాన్ని అందుకొని వంద కోట్ల క్లబ్బులో కలెక్షన్స్ సైతం అందుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. సౌత్ ఇండస్ట్రీలోనే బెస్ట్ డబ్ల్యూ మూవీగా పేరు పొందడమే కాకుండా హీరో హీరోయిన్లకు కూడా మంచి క్రేజ్ అందించింది. అయితే ఈ క్రేజీని మాత్రం ఈ జోడి సరైన పద్ధతిలో ఉపయోగించుకోలేకపోయినట్లు తెలుస్తోంది.

అలా గతంలో ఎన్నో రిస్కులు తీసుకొని ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు.. ఉప్పెన సినిమాతో ఎంత త్వరగా ఊహించని స్థాయిలో సక్సెస్ లభించిందో అంతే త్వరగా ఫెయిడౌట్ అవుతూ ఉన్నారు. ప్రస్తుతం ఒక మోస్తారు సక్సెస్ అందుకోవడానికి కూడా చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.అలాగే అవకాశాలు కూడా తగ్గుతూ ఉన్నట్లు సమాచారం. హీరో వైష్ణవి తేజ్ అయితే తనకు సెట్ కానటువంటి క్యారెక్టర్ లను స్టోరీలను చేసుకుంటే డిజాస్టర్ లతో మూటగట్టుకుంటున్నారు.

తాను నటించిన కొండపొలం, రంగ రంగ వైభవంగా ఆదికేశవ సినిమాలు భారీ డిజాస్టర్ లను మూటకట్టుకున్నాయి. కృతి శెట్టి విషయానికి వస్తే ఉప్పెనతో మంచి స్థాయిలో క్రేజీ అందుకున్న ఆ వెంటనే ఈమె వరస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా కోటి రూపాయల రెమ్యూనరేషన్ కూడా అందుకునేలా ప్లాన్ చేసుకుంది.. అయితే కొన్ని చిత్రాలు ఈమె రెమ్యూనరేషన్ కోసం ఆలోచించకుండా చేయడంతో అవి బెడిసి కొట్టాయి.. శ్యామ్ సింగరాయ, బంగార్రాజు తప్ప ఇక తర్వాత ఈమె నటించిన చిత్రాలలో దివారియర్, మాచర్ల నియోజకవర్గం తదితర చిత్రాలు డిజాస్టర్లుగా మిగిలాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో కేవలం ఒక్క సినిమా మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. అలా ఉప్పెన సినిమాతో తెచ్చుకున్న క్రేజీ ని అమాంతం చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు.