తన కెరీర్ లో ప్రభాస్ కి నచ్చిన సినిమా ఇదే.. నచ్చనది మాత్రం ఆ మూవీనే..!!

పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఆయన నటించిన ఈశ్వర్ సినిమా 11 నవంబర్ 2002లో రిలీజ్ అయింది . అంటే సుమారు ఆయన నటించిన  సినిమా రిలీజ్ అయి 21 సంవత్సరం కావస్తుంది.  అయితే తన 21 ఏళ్ల కెరియర్లో ప్రభాస్ ఎన్నో సినిమాల్లో నటించాడు.

కొన్ని సినిమాలు  హిట్ అయ్యాయి కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి . కొన్ని సినిమాలు ప్రభాస్ కెరియర్లో చిరస్థాయిగా నిలిచిపోయే రికార్డ్స్ నెలకొల్పాయి.  కాగా ప్రభాస్ తన కెరీర్ లో  పదేపదే చూడాలి అనిపించే సినిమా ఏంటి అంటే మాత్రం ఛత్రపతి అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకు వచ్చాడు . ఛత్రపతి సినిమా ఆయన కెరియర్ లోనే ది బెస్ట్ అంటూ ఆయన పొగిడేసుకున్నారు .

అంతే కాదు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రభాస్ కెరియర్ లోనే ఓ బిగ్ మైల్ స్టోన్ క్రియేట్ చేసింది. ప్రభాస్ కి నచ్చని సినిమా ఏంటి అంటే మాత్రం రాఘవేంద్ర అని చెప్పుకొచ్చాడు . ఆ సినిమా ఎందుకు సైన్ చేసానో తెలియదు.. అసలు ఆ సినిమా చేసే టైంలో నాకు సినిమాలు చూస్ చేసుకోవడం కూడా తెలయదు అంటూ ప్రభాస్ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి..!!