రియల్ హీరోగా మరోసారి ప్రూవ్ చేసుకున్న సోను సూద్‌.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న నేటిజన్లు.. ఏం చేశాడంటే.. ?

సోను సూద్ సినీ కెరీర్‌లో ఎన్నో నెగటివ్ షేడ్స్ లో నటించిన సంగ‌తి తెలిసిందే. అయితే రియల్ లైఫ్ లో మాత్రం హీరోగా మారి ఎంతోమందికి చేయూతనిచ్చాడు. కరోనా మహమ్మారి సమయంలో దేశవ్యాప్తంగా సోనూసూద్ పేరు మారుమోగిన సంగతి తెలిసిందే. వేలాది మందికి సహాయం చేసి ప్రశంసలను అందుకున్న సోను సూద్‌ను ఈ సంఘటన తర్వాత చాలామంది దేవుడిలా భావించి కొలుస్తున్నారంటే ఆయన మంచితనం వల్లనే. ఇక ప్రస్తుతం సినిమాల కంటే సామాజిక కార్యక్రమాలపై ఎక్కువ శ్రద్ధ చూపురున్నాడు సోనూసూద్. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే, కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తూ తాన సంపాదించిన డబ్బుతో ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడు.

ఇక నిన్న తన అభిమానులతో కలిసి దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకున్నాడు. దీపావళి సందర్భంగా ఇంటిముందు అభిమానులు గుమ్మి కూడడంతో వారిని ఆత్మీయంగా పలకరించిన సోనుసూద్ అభిమానులకు ఆటోగ్రాఫ్, సెల్ఫీలు ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దీపావళి నా కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంటున్నట్లు నేను ఫీల్ అవుతున్న వారి ప్రార్థనలతోనే నేను ఈ స్టేజిలో ఉన్నా. పండగ రోజు ఏదైనా పార్టీకి వెళ్లి సరదాగా ఉండడం కంటే ఇలా వీరితో గడపడం మనసుకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. తర్వాత అక్కడికి వచ్చిన అందరికీ స్వీట్స్ గిఫ్ట్ బాక్స్ ఇచ్చాడు. కొందరి పేద విద్యార్థులకు టాబ్స్‌ కూడా అందించాడు.

చాలామంది అభిమానులు వారికున్న ఇబ్బందులు తెలిపి సాయం చేయాలని ఒక అర్జీ పాత్రాన్ని సోను సూదుకు ఇచ్చారు. అవన్నీ స్వీకరించిన సోను త్వరలో కాల్ చేస్తామని తెలిపాడు. దీంతో వాళ్లంతా ఎంతో సంతోషంగా దీపావళిని జరుపుకున్నారు. సోను సూద్ అవసరమైన వారికి సహాయం చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటాడు. కాగా బీహార్ లోని నవాడా నగరంలో పక్రీభరవన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోగన్ పంచాయతీ అమరాపూర్ గ్రామంలో గుల్షన్ అనే ఓ 11 నెలల ఆడపిల్ల పుట్టుకతోనే అందురాలిగా పుట్టింది. కుటుంబం కూడా నిరుపేద కుటుంబం కావడంతో చిన్నారికి ఆపరేషన్ స్తోమత లేక సోను సూద్‌ను స‌హాయం కోర‌గా ఆయన వారి బాధను తీర్చాడు. గుల్షన్ కంటిచూపు వచ్చేలా చేసాడు.

కొన్ని నెలల క్రితం ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారికి సోను సహాయం అందించాడు. ఉజ్జయిని.. తిరువ‌తి ధామ్‌లో ఆధ్వర్య అనే బాబు స్పైనల్ మస్క్యులర్ అట్రాఫిస్మాతో ఇబ్బంది పడుతున్నాడు. ఆ బాబు ఆవేదనను సోను సూద్‌తో పంచుకోగా దానికి వీలైనంతవరకు సాయం చేశాడు. అంతేకాకుండా ఆ పాప చికిత్స కోసం మీరు కూడా విరాళాలు అందించాలి అంటూ ప్రజలను కోరుకున్నాడు. త్వరలో ఈ చిన్నారికి ఆపరేషన్ చేపించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇలా ఎప్పటికప్పుడు తన గొప్ప మనసును చాటుకుంటున్న సోనూసూద్ కు ప్రజాదారణ భారీగా పెరిగింది. ప్రస్తుతం సోనూసూద్ చేసిన సేవలు తెలియడంతో సోను సూద్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.