పెద్ద యుద్దానికే దారి తీసిన సందీప్ మాస్టర్ ” బొంగు ” లో గొడవ… నాగార్జున అలా అనడం మహా పాపం …!!

సందీప్ మాస్టర్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకి వచ్చినప్పటి నుంచి… ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తున్నాడు. ఆయన అన్న బొంగు అనే మాటను భూతద్దం పెట్టి చూపించినట్టే చేశారు బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున. అంతకన్నా బూతులు మాట్లాడిన వాళ్లు హౌస్ లో ఉన్నారు. వాళ్ల మీద లేవని నోరు ఒక సందీప్ మాస్టర్ పైనే లేచింది. బొంగు అని అనడం తప్పు అని చెప్పి ఉంటే తప్పేం కాదు కానీ…”బొంగులో డాన్సర్ ” అంటూ సందీప్ మాస్టర్ ని నాగార్జున ఘోరంగా అవమానించాడు.

బొంగు అనేది అంత పెద్ద బూతే అయితే.. చాలా సినిమాలలో ఆ పదాన్ని వాడేవారు. అది బూతు కానప్పుడు… అదెలా భూతని అంటారు. అదే పాయింట్ పై బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయినా సందీప్ మాస్టర్ మాట్లాడాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సందీప్ మాట్లాడుతూ…” నా డాన్స్ ని ఇష్టపడే వాళ్లు లక్షల్లో ఉన్నారు. కానీ హోస్ట్ నాగార్జున గారు.. బొంగులో డ్యాన్స్ అని అనడంతో చాలా ఫీల్ అయ్యాను. ఆయన నన్ను బొంగులో గేమ్ ఆడాను.. అని ఉంటే నేను అంత ఫీల్ అయ్యే వాడిని కాదు.

ఎందుకంటే డ్యాన్స్ నా వృత్తి. దాన్ని పట్టుకుని బొంగులోది అని అనడం చాలా రాంగ్ ” అంటూ చెప్పుకొచ్చాడు ‌. దీనిపై స్పందిస్తున్న ప్రేక్షకులు…” నాగార్జున అలా అనడం మహా పాపం. ఆయన కూడా సినిమాలలో డ్యాన్స్ చేస్తాడు కదా. ఆ డ్యాన్స్ వల్లే కొన్ని సినిమాలు సైతం హిట్ అయ్యాయి . అది గుర్తుంచుకోండి ” అంటూ ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం సందీప్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.