భూమిక తో గొడవల పై క్లారిటీ ఇచ్చిన హీరో శ్రీరామ్..!!

తమిళ నటుడు హీరో శ్రీరామ్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే.. స్నేహితుడు సినిమా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ తమిళ హీరో ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించారు. 20 ఏళ్లకు పైగా తెలుగు తమిళ సినీ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించిన ఈ నటుడు పెద్దగా సక్సెస్ లను మాత్రం అందుకోలేకపోయారు. శ్రీరామ అసలు పేరు శ్రీకాంత్ తెలుగులో ఒకరికొకరు అనే సినిమా ద్వారా మొదటిసారి శ్రీరామ్ గా పేరు మార్చుకోవడం జరిగింది.

ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, దడ, నిప్పు ,లై తదితర చిత్రాలలో నటించడం జరిగింది. తాజాగా శ్రీరామ్ ఒక తెలుగు యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ తన ఫేవరెట్ హీరోయిన్ భూమిక గురించి మాట్లాడడం జరిగింది. వీరి కాంబినేషన్లో రోజాపూలు ,బడి, కనై నంబతే వంటి చిత్రాలు విడుదలయ్యాయి తాజాగా ఇంటర్వ్యూల శ్రీరామ్ తనకు ఇష్టమైన హీరోయిన్ భూమిక గురించి మాట్లాడుతూ ఆమెను చంపేయాలన్న కోపం ఒకానొక సమయంలో వచ్చిందని మూవీ సినిమా షూటింగ్ సగంలో అవ్వగానే సెట్ లో నుంచి వెళ్లిపోయిందట..

ఆ తర్వాత చాలా రోజులకు ఎయిర్పోర్ట్లో కలిసినప్పుడు మూవీ పూర్తి అయ్యిందా అంటూ పలకరించిందట.ఆ సమయంలో అక్కడే తన మీద చాలా కోపం వచ్చిందని చెప్పుకొచ్చారు..అలా మా ఇద్దరి మధ్య గొడవలు కూడా ఉన్నాయని తెలిపారు. మూడు రోజుల క్రితమే తనతో మాట్లాడానని అప్పుడు ఆమె చేసిన పని గుర్తుకొచ్చి నవ్వుకుందని తెలియజేశారు. కానీ సినిమా అంటే ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయని టీం కూడా చాలా కూల్గానే పనిచేసుకుంటూ వెళ్లిపోయారని తెలిపారు. పృధ్విరాజ్ సుకుమారన్ అంటే తనకు చాలా గౌరవం అని తెలిపారు.