15 ఏళ్ల వయసులోనే అలాంటి పని చేసి పోలీసులకు దొరికిన ధనుష్ కొడుకు.. ఏం జ‌ర‌రిగిందంటే..?!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మనందరికీ సుపరిచితమే. ఈయన తమిళ్ లోనే కాకుండా తెలుగులో సైతం పలు సినిమాలు చేసి మంచి గుర్తింపు పొందాడు. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్యాను పెళ్లి చేసుకుని తలైవర్‌ అల్లుడుగా మరింత క్రేజ్ పొందాడు. ఇక వీరిద్దరికీ ఇద్దరు కుమారులు కూడా జన్మించిన అనంతరం ఏవో కారణాలు వల్ల విడాకులు తీసుకుని విడిపోయారు.

వీరిద్దరికీ పుట్టిన యాత్ర,లింగా ఇద్దరు కొడుకులు మాత్రం తల్లిదండ్రులు ఇద్దరి దగ్గర ఉంటున్నారు. తాజాగా ధనుష్, ఐశ్వర్యాల పెద్దకొడుకు యాత్ర స్పోర్ట్స్ బైక్ నడుపుతూ పోలీసులకు దొరికిపోయాడు. 15 ఏళ్లు ఉన్న యాత్ర డ్రైవింగ్ లైసెన్స్ కూడా రాకుండానే తాము ఉంటున్న పోయేన్ గార్డెన్ ఏరియాలో బైక్ నడిపాడు. అది చూసిన వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త మరింత వైరల్ గా మారింది.

ఈ క్రమంలోనే ఈ వీడియోని చూసిన పోలీసులు కన్ఫర్మేషన్ కోసం ధనుష్ ఇంటికి వెళ్లారట. హీరో ధనుష్ కొడుకు అని తెలిసి రూ.1000 జరిమానా విధించారట. వెంటనే ధనుష్ ఆ డబ్బులు కట్టి పోలీసులతో మాట్లాడారని సమాచారం. ఇందులో నిజం ఎంత అనేది తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.