యంగ్ టైగర్ ఎన్టీఆర్ మనందరికీ సుపరిచితమే. ఈయన తాజాగా నటిస్తున్న మూవీ ” దేవర “. ఈ సినిమా రెండు భాగాలుగా రానున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతుంది. డిసెంబర్ ఎండింగ్ కు ఈ సినిమా చిత్రీకరణ పూర్తికానుంది. ఆ తర్వాత తారక్ బాలీవుడ్ ప్రాజెక్ట్ ” వార్ 2 ” సెట్స్ లో జాయిన్ కానున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం తానే స్వయంగా యాక్షన్ స్టంట్స్ చేయబోతున్నాడు.
ఇదిలా ఉంటే ఇందులో నెగిటివ్ షెడ్ లో కనిపించనున్న తారక్… మరో స్టార్ హీరో హృతిక్ రోషన్ కు గట్టి పోటీ ఇస్తాడంటూ టాక్ వినిపిస్తుంది. అయితే హృతిక్ పక్కన హీరోయిన్ గా ఇప్పటికే దీపికాను సెలెక్ట్ చేయగా.. ఇద్దరి కాంబినేషన్ లో విదేశాల్లో షూటింగ్ పూర్తయింది. కాగా ఇప్పుడు తారక్ జోడిని సెట్ చేసే పనిలో ఉన్నాడు డైరెక్టర్. ఈ క్రమంలోనే యంగ్ బ్యూటీ శార్వరీ వాఘ్ ను ఫైనలైజ్ చేసినట్లు సమాచారం.
ఇక ప్రముఖ ఫిల్మ్ మేకర్ సంజయ్ లిలా భన్సాలీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసిన ఈమె… ఆ తర్వాత హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ విజయాలను ఖాతాలో వేసుకుంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈమె గురించి సెర్చ్ చేసిన తారక్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా పెరిగిందానే చెప్పాలి. కాగా ఈ ముద్దుగుమ్మ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.