” ప్రతి ఒక్కరికి నా శరీరమే కావాలి “.. స్టేజ్ పై సిగ్గు పడకుండా చెప్పిన RX 100 హీరోయిన్…!!

ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి భారీ క్రేజ్ సంపాదించుకున్న‌ హీరోయిన్లలో పాయల్ రాజ్‌పుత్ ఒకరు. అనంతరం డిస్కో రాజా, వెంకీ మామ లాంటి సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా విజయం అందుకోలేకపోయింది. ఈ బ్యూటీ కెరీర్ టర్న్ తిప్పే సబ్జెక్ట్ కోసం ఎదురుచూస్తున్న సమయంలోనే ఆర్ ఎక్స్ 100 లాంటి బ్లాక్ బస్టర్ సినిమా ఛాన్స్ కొట్టేసి తన టాలెంట్ నిరూపించుకుంది.

ఇక తాజాగా ” మంగళవారం ” సినిమా నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీ హిట్ అయిన సందర్భంగా పాయల్ సక్సెస్ మీట్‌లో పాల్గొంది. అక్కడ పాయ‌ల్‌ మాట్లాడుతూ.. ” అజయ్ భూపతి ఆర్ఎక్స్ 100, మంగళవారం సినిమాలతో రెండు బ్లాక్ బాస్టర్ హిట్స్ ఇచ్చారు.

ఈ సినిమాలో బోల్డ్ పాత్రలు నటించినప్పటికీ బయట అలా ఉంటారని కాదు. కొంతమంది చేసే నెగిటివ్ కామెంట్స్ మనసును చాలా బాధ పెడుతున్నాయి. ప్రతి ఒక్కరూ నా బాడీ గురించే మాట్లాడుతున్నారు. ఇది సరైనది కాదు. సినిమాలో బోల్డ్ గా చూపించిన క్యారెక్టర్ మాత్రం సానుభూతి పొందేలా ఉంటుంది ” అంటూ పాయల్ ఫైర్ అయ్యింది. ప్రస్తుతం పాయల్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.