టాలీవుడ్ లో టాప్ కమెడియన్ గా ఒకప్పుడు మంచి పాపులారిటీ సంపాదించుకున్న సునీల్.. ఎన్నో చిత్రాలలో కమెడియన్ గా తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ ఉండేవారు. అప్పుడు సునీల్ ఒక చిత్రానికి 10 లక్షల రూపాయల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకునేవారు.. ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి పర్వాలేదు అనుకున్నారు. అందాల రాముడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆ తర్వాత మళ్లీ కమెడియన్ గా పలు సినిమాలలో నటించారు.
కానీ రాజమౌళి తెరకెక్కించిన మర్యాద రామన్న సినిమాతో మరింత క్రేజీ అందుకున్న సునీల్ ఆ తర్వాత పూలరంగడు సినిమాతో కూడా మంచి విజయాన్ని అందుకున్నారు.ఈ సినిమాకు 3 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకోవడం జరిగిందట. ఆ తర్వాత నటించిన సినిమాలన్నీ కూడా ఫెయిల్యూర్ గానే మిగిలాయి. దీంతో మళ్లీ కొన్నేళ్లు గ్యాప్ ఇచ్చి కామెడీ రోల్స్ లో నటించారు. ఇవి కూడా ఫెయిల్యూర్ గా మిగిలాయి. దీంతో నెగిటివ్ క్యారెక్టర్స్ లో కూడా నటించడం జరిగింది. కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. కలర్ ఫోటో సినిమాలో విలన్ గా నటించి ఆ తర్వాత పుష్ప సినిమాతో మరింత పాపులారిటీ అందుకున్నారు.
ఇక ఇప్పుడు జైలర్ సినిమాలో కూడా ఒక కీలకమైన పాత్రలో నటించి మంచి క్రేజ్ అందుకున్న సునీల్ మహావీరుడు సినిమాలో కూడా డిఫరెంట్ రోల్స్ లో నటించారు. ప్రస్తుతం విలన్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న సునీల్ ఒక్క చిత్రానికి రోజుకి 6 లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని టాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రెమ్యూనరేషన్ విని పలువురు అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.