మెగా కోడలు ఉపాసన ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా.. చెర్రీ మాత్రం కాద‌ట‌..!!

మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన మనందరికీ సుపరిచితమే. రామ్ చరణ్, ఉపాసన కొన్నేళ్ళుగా ప్రేమలో ఉండి.. అనంతరం పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. పదేళ్ల తరువాత వీరికి హైదరాబాద్‌లోని అపోలో హాస్పటల్లో పండంటి బిడ్డ కూడా జన్మించింది. దీంతో మెగా ఫ్యామిలీతో పాటు మెగా అభిమానులు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా చిరంజీవి సంతోషానికి అయితే హద్దులు లేవు.

ఇక ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉండగా… ఉపాసనకు ఆ హీరో అంటే చాలా ఇష్టమంటూ న్యూస్‌ సోషల్ మీడియాలో తెగ‌ వైరల్ అవుతుంది. ఆ హీరో రామ్ చ‌ర‌ణ్ కాద‌ట‌. మరి అత‌ను ఎవ‌రంటే.. సెంటిమెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన విక్టరీ వెంకటేష్.

మొదటినుంచి ఉపాసనకు ఫ్యామిలీ సెంటిమెంట్ మూవీస్ అంటే చాలా ఇష్టమట. దీంతో వెంకటేష్ నటనకు ఉపాసన ఫిదా అయిపోయి ఆయనకి పెద్ద ఫ్యాన్ అయిపోయిందట. ఉపాసన ఇప్పటికీ కూడా వెంకటేష్ నటించిన సినిమాలు టీవీలో చూస్తూ ఉంటుందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.