మీ శరీరం పైన ఈ మచ్చలు కనిపిస్తున్నాయా.. అయితే ప్రమాదమే..!!

మన శరీరంలో అతిపెద్ద అవయవం ఏదంటే మన చర్మమే.. అయితే చర్మం మీద వచ్చే మచ్చలు గాయల మచ్చలు వెనుక చాలా పెద్ద కథ ఉంది. అయితే ఇప్పుడు తాజాగా శరీరం పైన అకాంథోసిస్ మైగ్రీన్ అనే మచ్చలు కూడా ఏర్పడుతున్నాయట. ఇవి తగ్గాలంటే శరీరంలో చక్కెర స్థాయిని కంట్రోల్ గా ఉంచాల్సిందే అంటూ లేకపోతే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉందని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు.

అకాంథోసిస్ మైగ్రీన్సమస్యలు ఉన్న వారి చర్మం పైన నల్ల మచ్చలు ఏర్పడడమే కాకుండా.. మెడ ,చంకలు నడుము, ఇతరత్ర ప్రాంతాలలో కూడా చాలా కనిపిస్తూ ఉంటాయట. కొన్నిసార్లు మోచేతులు, మోకాళ్ళ పైన కూడా ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయని నిపుణులు తెలుపుతున్నారు. ఈ మచ్చలు చర్మం లో ఎరుపు లేదా గోధుమ రంగులో కనిపిస్తూ ఉంటాయట. ఇవి ఎక్కువగా షుగర్ ఉన్న వారిలో సాధారణంగా కనిపిస్తూ ఉంటాయట.. ఈ మచ్చలు కాస్త దురదగానే ఉంటాయని ఈ మచ్చలు కారణం ఏదైనా కాని..సమస్య ఒక్కటే అని ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం ఉత్తమం అని తెలుపుతున్నారు.

ఈ మచ్చలపైన దురద ఇబ్బంది పెట్టే సమస్యగా మారుతుందట.. ఇలాంటివి చర్మానికి సంబంధించిన సమస్యలను తేలికగా తీసుకోకూడదు. పొడి దురద చర్మం అనేక కారణాలకు కావచ్చు.. ఈ మచ్చలను సైతం ఎలా కంట్రోల్ చేయాలి అంటే షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడం వల్ల ఇవి రావడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుందట. వీలైనంతవరకు తేలికపాటి సబ్బును ఉపయోగించి స్నానం చేసిన తర్వాత పొడి దుస్తులను ధరించడం మంచిది.. వీటితోపాటు వ్యాయామం, యోగ వాకింగ్ వంటివి చేయడం వల్ల రక్తప్రసరణ చాలా మెరుగుపరుస్తుందట.