మహేష్, రామ్ చరణ్ మధ్య అంత స్నేహబంధం ఉందా… వీళ్లు అవి కూడా మార్చుకుంటున్నారు గా…!!

టాలీవుడ్ టాప్ హీరోల మధ్య ఉండే బాండింగ్ మనం ఫంక్షన్స్, పార్టీస్ లో చూస్తూనే ఉంటాం. ఈ సోషల్ మీడియా వల్లే వారి పర్సనల్ విషయాలు ఎక్కువగా బయటకు వస్తాయి. ఇంట్లో ఏ పార్టీలు జరిగినా.. ఏ పండగ సెలబ్రేట్ చేసుకున్న వారికి సంబంధించిన ఫోటోలు చిటికలో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఇక స్టార్ హీరోలు, వారి ఫ్యామిలీల మధ్య ఉండే స్నేహం కూడా ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది.

ఈ నేపథ్యంలోనే మహేష్, రామ్ చరణ్ మధ్య ఉన్న క్లోజ్ బాండింగ్ మీద చర్చలు జరుగుతున్నాయి. ఇక తాజాగా ఈ ఫోటోలను ఫాన్స్ డీ కోడ్ చేయడం మొదలుపెట్టారు. చరణ్, మహేష్ ఫోటోలను కాస్త గమనిస్తే.. వారిద్దరూ ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అనేది అర్థమవుతుంది. ఆ ఫోటోలో ఓ చోట మహేష్ బాబు వేసుకున్న చెప్పులు.. మరో చోట రామ్ చరణ్ వద్ద కనిపించాయి.

ఎవరివి ఎవరు వేసుకున్నారనేది తెలియదు కానీ.. ఇద్దరు చెప్పులు మార్చుకోవడం చూస్తుంటే వీరు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అర్థమవుతుంది. సాధారణంగా చాలామంది సెలబ్రిటీలు ఒకరికి సంబంధించిన వస్తువులను మరొకరు చేసుకోవడానికి ఇష్టపడరు. కానీ వీరిద్దరిని చూస్తే చూడముచ్చటగా ఉందంటూ ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.