మళ్లీ కలిసి నటించబోతున్న చిరంజీవి-రవితేజ.. ఏ సినిమాలో అంటే..ఫ్యాన్స్ కి పూనకాలే..!!

వాట్ .. మళ్లీ మెగాస్టార్ చిరంజీవి రవితేజ కలిసి నటించబోతున్నారా ..? నిజంగా ఇది అభిమానులకి పెద్ద పండగే . ప్రజెంట్ ఇలాంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో మల్టీ స్టారర్ల ట్రెండ్ ఎక్కువగా కొనసాగుతుంది . సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాలో మహేష్ బాబు వెంకటేష్ నటించిన తర్వాత ఇలాంటి సినిమాలు హిట్ అవుతాయి అని డైరెక్టర్లు కూడా నమ్ముతున్నారు .

అందుకే ఎక్కువగా అలా మల్టీస్టారర్ సినిమాలను తెరకెక్కించాలని ఆశపడుతున్నారు. కాగా ఇప్పటికే ఇండస్ట్రీలో బోలెడన్ని మల్టీస్టారర్ సినిమాలు వచ్చాయి. కొన్ని హిట్ అవ్వగా మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి. అయితే రీసెంట్ గా చిరంజీవి మరోసారి మల్టీ స్టారర్ సినిమాకి ఓకే చేసినట్లు తెలుస్తుంది . గతంలో అన్నయ్య సినిమాలో రవితేజ చిరంజీవి స్క్రీన్ షేర్ చేసుకున్నారు .

ఆ తర్వాత బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్యలోను స్క్రీన్ షేర్ చేసుకున్నారు . ముచ్చటగా మూడోసారి బింబిసార డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలోను చిరంజీవి రవితేజ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు ఓ న్యూస్ సినీ వర్గాలలో హల్చల్ చేస్తుంది. ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో రవితేజ కనిపించబోతున్నారట . అంతేకాదు చిరంజీవికి మించిన క్రేజ్ పేరు ఈ సినిమా ద్వారా రవితేజకు రాబోతుంది అంటూ వశిష్ట చెప్పి మరి రవితేజను ఈ సినిమాకు సైన్ చేసేలా చేశారట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతున్నాయి..!!