నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సైతం క్రియేట్ చేయడం జరిగింది. బాలయ్య తనలోని కొత్త యాంగిల్ ని సైతం బయటపెడుతూ అభిమానులతో ప్రశంసలు అందుకునేలా చేసుకుంటున్నారు. ఇక తదుపరి సినిమాలో డైరెక్టర్ బాబి దర్శకత్వంలో చేయబోతున్నారు. ఈ ప్రాజెక్టు కూడా విభిన్నమైన యాక్షన్ తో ఉండబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన త్రివిక్రమ్ బ్యానర్ తో కలిసి నిర్మిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది.
రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు అయ్యిందని అయితే ఇందులో ఒక ప్రత్యేకమైన పాత్ర కోసం మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ ని తీసుకోబోతున్నట్లు సమాచారం. గతంలో కూడా డైరెక్టర్ బాబి చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ అని తీసుకొని మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించేలా చేశారు. ఇప్పుడు డైరెక్టర్ బాబి ఇదే ఫార్మాట్లో బాలయ్యను హీరోగా పెట్టి కీలకమైన పాత్రలో దుల్కర్ సల్మాన్ ని తీసుకునే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
దుల్కర్ పాజిటివ్ నెగిటివ్ ఉన్న షేడ్ల లో పాత్రలు ఆయన తను కచ్చితంగా పర్ఫెక్ట్ గా చేయగలరని ఎన్నో సినిమాలలో నిరూపించారు. అందుకే బాలయ్య సినిమాలో డైరెక్టర్ బాబి అతనిని ఎలా ప్రజెంట్ చేస్తారు అంటూ అటు బాలయ్య అభిమానులు ఇటు దుల్కర్ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన చిత్ర బృందం తెలియజేస్తుందేమో చూడాలి మరి. త్వరలోనే నటీనటుల గురించి కూడా పూర్తి వివరాలు తెలియజేయబోతున్నట్లు తెలుస్తోంది.