ఆ ఒక్క సినిమా నయనతారను స్టార్ హీరోయిన్గా చేసిందా..!!

దక్షిణాది భాషలలో లేడీ సూపర్ స్టార్ గా పేరుపొందిన నయనతార ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. నయనతార నటించిన ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి. అంతేకాకుండా సౌత్ లోనే లేడీస్ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న నయనతార ఈ ఏడాది బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది.. తన మొదటి చిత్రంతోనే 1100 కోట్ల రూపాయల కలెక్షన్స్ సైతం అందుకునేలా చేసింది .నవంబర్ 18 వ తేదీన తన పుట్టినరోజు సందర్భంగా నయనతార గురించి తన సినీ లైఫ్ గురించి కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి.

Chandramukhi' retro review: A feast for Rajinikanth fans

ఈరోజు నయనతార 39వ బర్త్ డే సందర్భంగా.. అసలు నయనతార అసలు పేరు డయానా మరియం కురియన్.. ఇమే కుటుంబం మలయాళం.. కర్ణాటకలో ఇమే జన్మించింది. చిన్న వయసులో ఎక్కువగా బెంగళూరు గుజరాత్ ఢిల్లీ వంటి ప్రాంతాలలో ఉండేవారట. అయితే ఆ తర్వాత కుటుంబంతో కలిసి కేరళలో స్థిరపడిపోయారట. కెరియర్ మొదటిలో నయనతార యాంకర్ గా మోడల్ గా కూడా పనిచేసింది అక్కడినుంచి ఈమె కెరియర్ ప్రారంభించింది.

అలా నయనతార 18 ఏళ్ల వయసులోనే 2003లో మలయాళం సినిమా మనసినక్కరే అనే చిత్రంతో ఎంట్రీ ఇవ్వగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత రెండేళ్లకి రజనీకాంత్ నటించిన చంద్రముఖి సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడంతోపాటు స్టార్ స్టేటస్ ని అందుకుంది. ఈ చిత్రంతో ఈమె కెరియర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది అటు తెలుగు తమిళ్ మలయాళం వంటి భాషలలో అగ్ర హీరోల సరసన నటించే అవకాశాలను అందుకుంది. ప్రస్తుతం నయనతార ఒక్క చిత్రానికి 12 కోట్ల రూపాయలు ఛార్జ్ చేస్తున్నట్లు సమాచారం.